ఉప ముఖ్యమంత్రి తో క‌లిసి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఎంపి కేశినేని శివ‌నాథ్

5
0

 09-10-2024

ఉప ముఖ్యమంత్రి తో క‌లిసి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఎంపి కేశినేని శివ‌నాథ్ 

విజ‌య‌వాడ : మూల నక్షత్ర పర్వదినమైన బుధవారం ఇంద్రకీలాద్రి పై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ సరస్వతీ దేవి అవతారంలో కొలువుతీరిన జ‌గ‌న్మాత‌ను ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్, హోమ్ మినిస్ట‌ర్ వంగ‌ల‌పూడి అనిత‌ తో క‌లిసి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ద‌ర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ , ఎంపి కేశినేని శివ‌నాథ్ , హోమ్ మినిస్ట‌ర్ అనిత ఒకే స‌య‌మంలో ద‌ర్శ‌నం కోసం రావ‌టం జ‌రిగింది. వీరికి దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామరావులు ఆలయ అధికారులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మేళ తాళాలతో స్వాగతం పలికారు.

 దర్శనానంతరం రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ లతో కలిసి దేవాదాయ శాఖ అధికారులు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందజేశారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తన కుమార్తె ఆద్య తో అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here