ఉద‌యాన్నే వృద్ధుల‌కు పింఛ‌న్ పంపిణీ చేసిన రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

0

తేదీ 01-07-2025

శ్రీ‌కాకుళం జిల్లా, సంత‌బోమ్మాళి నా చేతులతో పింఛను ఇవ్వడం….నాకెంతో సంతృప్తినిస్తోంది

ఉద‌యాన్నే వృద్ధుల‌కు పింఛ‌న్ పంపిణీ చేసిన రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

శ్రీ‌కాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌కవ‌ర్గం సంత‌బోమ్మాళి మండ‌లం ఉమిలాడ గ్రామంలో రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజారు అచ్చెన్నాయుడు మంగ‌ళ‌వారం ఉద‌యాన్నే పింఛన్లు పంపిణీ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు మంత్రి స్వ‌యంగా వెళ్లి పింఛ‌న్లు పంపిణీ చేశారు. ల‌బ్ధిదారుల‌తో మాట్లాడి వారి క‌ష్టసుఖాల‌ను తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం అందిస్తోన్న సంక్షేమ ఫ‌థ‌కాలు సంతృప్తినిస్తున్నాయ‌ని, ప్ర‌తినెల ఉద‌యాన్నే ఇంటికి తెచ్చి ఇవ్వ‌డం ప‌ట్ల ల‌బ్ధిదారులు సంతోషం వ్య‌క్తం చేశారు.

పేదల పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.33 వేల కోట్లు కూట‌మి ప్ర‌భుత్వం అంద‌చేస్తుంది

నియోజకవర్గంలో పేదల సేవలో పేరిట నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉంద‌ని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పేదల పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.33, వేల కోట్లు కూట‌మి ప్ర‌భుత్వం ఖర్చు చేస్తుంద‌న్నారు. ప్రతి నెలా 63 లక్షల మందికి 28 రకాల పింఛన్లు ఇస్తున్నామ‌ని అన్నారు. పొరుగు రాష్ట్రాల‌లో ఇంత మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేద‌ని, మ‌న రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమంగా నిలుస్తోందని చెప్పారు. పేదలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో స్వయంగా పాల్గొని పింఛను ఇవ్వడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని, అందుకే ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. ప్రజల స్థితిగతులు, సాధకబాధ‌లు తెలుసుకోవడంతో పాటు, నా చేతులతో పింఛను ఇవ్వడం….నాకెంతో సంతృప్తినిస్తోందని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ పీఎసీఎస్ అద్య‌క్షుడు కింజ‌రాపు హ‌రివ‌ర ప్ర‌సాద్ ,ఆర్డీవో కృష్ట‌మూర్తి, అధికారులు, తెలుగు దేశం ముఖ్య నాయ‌కులు, పాల్గొన్నారు.

జోరు వానలో మంత్రి అచ్చెన్న పర్యటన..

సంతబొమ్మాళి మండలం ఉమిలాడ, జగన్నాథపురం గ్రామాల్లో జోరు వానలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటన సాగిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా నూతన పింఛన్ పంపిణీ కార్యక్రమం, సీసీ రోడ్లు, బీచ్ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు . అయితే ఈ సందర్భంలో జోరుగా వర్షం పడిన రాష్ట్ర మంత్రి తన పర్యటన కొనసాగించడం ఆయన పనితీరుకు నిదర్శనీయమని అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version