ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఎ1ఫౌండేషన్,

Spread the love

ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఎ1ఫౌండేషన్, 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా A1 ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, 

ఈ కార్యక్రమంలో రైల్వే శ్రీనివాసులు , ప్రముఖ రచయిత్రి పర్వీన్ సుల్తానా ,కార్తీక్ జావేలర్ అధినేత కాసీంకోట శ్రీనివాసులు, ఎన్ టి అర్ జిల్లా సెక్రటరీ నాగ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు, 

ఈ సందర్భంగా ఎ1 ఫౌండేషన్ చైర్మన్ అమీన్ భాయ్ మాట్లాడుతూ, 

చెట్లు మరియు మొక్కల పెంపకం ద్వారా మన జీవన విధానం మారుతుంది,

నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి, ఎండల తాకిడికి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి,

ప్రకృతి ప్రకోపంతో అన్ని జీవాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, 

ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మొక్కలు నాటి వాటి పెంపుదల చేపట్టి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు, 

చిన్న పిల్లలకు మన ప్రకృతి మరియు పర్యావరణ పరిరక్షణ కోసం తల్లిదండ్రులు మరియు ఉపాద్యాయులు అవగాహన కల్పించాలని కోరారు, 

రానున్న రోజుల్లో ఎండ తీవ్రత 60 డిగ్రీలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు, 

ప్రతి ఒక్కరూ పుట్టిన రోజు, పెళ్లి రోజు, మరియు అన్ని శుభ కార్యకలాపాలలో బోకేలు లేక పూలదండలు కాకుండా ఒక మొక్క ను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాలీ ,

తద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం మనవంతు కృషి చేయాలని సూచించారు, 

రానున్న వర్ష కాలంలో మొక్కల పంపిణీ కార్యక్రమం ఒక మహా యాజ్ఞంల చేపట్టి అవగాహన కల్పించాలని సంస్థ సభ్యులకు కోరారు,

పర్యావరణ పరిరక్షణ కోసం మా ఎ1 ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 రాష్ట్రాలలో మా సభ్యులు మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, 

ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తెలంగాణ రాష్ట్ర లలో 

ఈ కార్యక్రమం నిర్వహించారు,

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *