ఇంద్రకీలాద్రి శ్రీదుర్గగుడి లో ప్రత్యేక పూజలు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు

0
0

దుర్గగుడిలో ప్రత్యేక పూజలు చేసిన

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు

విజయవాడ దుర్గ గుడి, జూలై 27.
అమ్మవారి ఆలయానికి ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన వారికి
ఆలయ కార్య నిర్వహణ అధికారి వి కే శీనా నాయక్,
వేద పండితులు స్వాగతం పలికి పూర్ణ కుంభంతో అమ్మవారి సన్నిధి వద్దకు తీసుకెళ్లారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీస్సులు అందజేయగా అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాల్ని ఈవో వారికి అందజేయడం జరిగింది.
అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న అద్దాల మండపం లో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల పవళింప సేవలో పాల్గొన్నారు . ఇంద్రకీలాద్రి కొండపైన ఉన్నంతసేపు ఆలయ విశిష్టత శ్రీ అమ్మవారికి జరిగే నిత్య పూజ పూజలు ,ఆలయ అభివృద్ధి గురించి కార్యనిర్వాహణాధికారి వారి వద్ద నుండి తెలుసుకొని శీ నా నాయక్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులు స్పందిస్తున్న వసతి సౌకర్యాలపై అభినందనలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here