ఇంద్రకీలాద్రి-విజయవాడ. 06 మే 2025 ఎయిర్ పోర్ట్ లో శ్రీ కనక దుర్గమ్మ వారికి పునః వైభవం

0

శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి-విజయవాడ. *06 మే 2025*ఎయిర్ పోర్ట్ లో శ్రీ కనక దుర్గమ్మ వారికి పునః వైభవం అందరికీ అమ్మ, జగన్మాత దర్శనం విమాన ప్రయాణీకులకు అందుబాటులో ఉండాలని విజయవాడ విమానాశ్రయంలో రాష్ట్రప్రభుత్వయంత్రాంగం ఆదేశాలుతో 2016 లో ఎరైవల్, డిపార్చర్ బ్లాక్ ల వద్ద ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గమ్మ వారి ప్రత్యేక చిత్రపటం, కౌంటర్ ను ఈరోజు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ సందర్శించారు.గతంలో ప్రతీ శుక్రవారం అమ్మవారి వద్ద దేవస్థానం నుండి పూజ నిర్వహించే వారని, కుంకుమ, కర పత్రాలు అందుబాటులో ఉండేవని, నాలుగైదు ఏళ్లుగా అందుబాటులో లేవని విమానాశ్రయం సిబ్బంది ఈవో కి వివరించారు.ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి వచ్చి పోయే ప్రజలకు శుభం జరుగాలని విజయవాడ ఎయిర్ పోర్ట్ లో శ్రీ కనక దుర్గమ్మ వారికి పునః వైభవం దిశగా చర్యలు తీసుకుంటానని, అమ్మవారి ఆశీస్సులు అందరికి అందేలా పూర్వం మాదిరిగా ఏర్పాటు చేస్తానని శీనానాయక్ ప్రకటించారు. త్వరలో అధునాతన రీతిలో అమ్మవారి కౌంటర్ ఏర్పాటు చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు వారిని ఆదేశించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version