శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ
02 జూలై 2025
దుర్గమ్మ సన్నిధిలో సాధు పరిషత్ సభ్యులు
విజయవాడ లో జరుగుతున్న జాతీయ హిందూ ధార్మిక సదస్సు నిమిత్తం విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్ సాధు పరిషత్ సభ్యులు ఈరోజు సాయంత్రం శ్రీ కనక దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.
ధర్మాన్ని ఆచరిస్తూ, ఆధ్యాత్మికతను పెంపొదించే సమాజహితం కోరే సాధు పుంగవులకు సముచిత రీతిలో స్వాగతించి, అమ్మవారి దర్శనం, ప్రసాదం, ఆశీర్వచనం ఏర్పాటు చేయాలని కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ ఆదేశాల ప్రకారం దేవస్థానం ప్రోటోకాల్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం సాధు పరిషత్ సభ్యులు మహా మండపం లో ఆషాఢ సారె కార్యక్రమం తిలకించారు.
సనాతన ధర్మాన్ని కాపాడే సామూహిక ధార్మిక కార్యక్రమాల ఏర్పాటు,భక్తులకు ఉచిత ప్రసాదం, అన్న ప్రసాదం అందించడం హర్షనీయమని సాధువులు అన్నారు.