ఇంద్రకీలాద్రి కార్యనిర్వాహణాధికారి & స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వి. కె. శీనానాయక్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ మరియు ట్రాఫిక్ పోలీస్ వారితో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు.

0

ఇంద్రకీలాద్రి, 22 జూలై 2025

ఈరోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి & స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వి. కె. శీనానాయక్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ మరియు ట్రాఫిక్ పోలీస్ వారితో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు.
శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయు భక్తులు దుర్గా ఘాట్ లో ప్రవేశమై పుణ్యస్నానం ఆచరించిన తదుపరి ప్రత్యేక మార్గం ద్వారా శ్రీ అమ్మవారి దర్శనమునకు సులభంగా విచ్చేయుటకు నూతన ప్రణాళిక గురించి చర్చించారు.
శ్రీ అమ్మవారి దర్శనమునకు విచ్చే భక్తులు తొలుత కేశఖండనశాల వినియోగించుకొను భక్తులు రోడ్డు మార్గము కింద నుండి ఏర్పాటు చేయబడిన అండర్ గ్రౌండ్ మార్గము ద్వారా శ్రీ దుర్గా ఘాట్ నందు స్నానమాచరించిన తదుపరి వారి లగేజ్ మరియు సెల్ ఫోను, చెప్పులు వగైరా కొండ క్రింది భాగమున నూతనంగా ఏర్పాటు చేయనున్న కౌంటర్ల వద్ద డిపాజిట్ చేసిన తదుపరి రిటైనింగ్ వాల్ దగ్గర ఏర్పాటు చేయబడిన బస్సు సౌకర్యము ద్వారా ఘాట్ రోడ్ నకు చేరుకొనవచ్చును లేదా మహామండపము వద్దకు కాలినడకన చేరుకొనవచ్చును.

నూతన ప్లాను అమలు చేయుట వలన ఘాట్ రోడ్ నందు మరియు లిఫ్ట్ మార్గమున రానున్న రోజుల్లో రద్దీ క్రమబద్ధీకరించబడి భక్తులకు సులువుగా ఉండును.
ఈ విషయమై ఈరోజు ప్రత్యేకంగా పోలీస్ మరియు ట్రాఫిక్ వారితో సమావేశమై పూర్తి యాక్షన్ ప్లాన్ తో జూలై 25,26 తేదీల్లో ట్రయిల్ రన్ నిర్వహించుకొని రానున్న వారం రోజుల్లో దాని ఫలితం ప్రకారం మరింతగా అమలు చేయుటకు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయబడును

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version