ఇంద్రకీలాద్రి, 24 జూలై 2025
ఆషాడం సారె సమర్పణ ఉత్సవములు నేటితో పరి సమాప్తి (ముగింపు) :- శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆషాడ శుద్ధ పాడ్యమి నుండి ఆషాడ అమావాస్య వరకు అనగా ది.26.06.2025, గురువారం నుండి ది.24.07.2025 గురువారం వరకు నెల రోజుల పాటు వివిధ దేవాలయములు, ధార్మిక సంస్థలు, భక్త సమాజముల వారిచే శ్రీ అమ్మవారికి “ఆషాడం సారె” సమర్పించినారు నేటితొ ఆషాఢ మాసము సారె సమర్పణ ఉత్సవ కార్యక్రమములు నేటితో (పరి సమాప్తి)ఘనంగా ముగిసినవి.
ఈ రోజు గురువారం ఉ. గం.08-00ని.లకు వైదిక సిబ్బంది తరపున స్థానాచార్య, ప్రధాన మరియు ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య మరియు అర్చకలు, పరిచారికులు, వైదిక సిబ్బంది, వేదపండితులు యావన్నంది అర్చక సిబ్బఁది శ్రీ అమ్మవారికి సారె సమర్పించినారు. సారెతొపాటు అమ్మవారి కి కానుకగా 40 గ్రాముల బంగారు హారము (4,25,000/- విలువ) కార్యనిర్వహణధికారివారి వి.కె.శీనా నాయక్, ప్రత్యేక శ్రేణి ఉప కలెక్టరు వారి చేతికి అర్చక స్వాములు తరుపున విరాళముగా అందించి చివరి రోజు కనులు విఁదుగా వేద మఁత్రముల నడుమ ఘనంగా ఆషాఢ సారె ముగిఁపు పలికినారు.