ఆలపాటి రాజేంద్ర గెలుపే లక్ష్యంగా పని చేయాలి

0

 ఆలపాటి రాజేంద్ర గెలుపే లక్ష్యంగా పని చేయాలి 

మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ 

కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గెలుపే లక్ష్యంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలు కృషి చేయాలని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆలపాటి గెలుపు కోసం మంగళవారం విజయవాడ భవాని పురంలోని ఎన్డీయే కార్యాలయంలో 

టిడిపి రాష్ట్ర సీనియర్ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎమ్మెస్ బేగ్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతా ఉల్లా,జనసేన స్టేట్ సెక్రెటరీ అమ్మిశెట్టి వాసు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఇతర ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ 

 కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉండటం వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, మోదీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు. పట్టబద్రుడైన ప్రతి వ్యక్తిని గుర్తించి వారిని స్వయంగా కలిసి ఓటరు నమోదు తో పాటు ఓటేసేలా బాధ్యత తీసుకోవాలన్నారు.

పశ్చిమ నియోజకవర్గంలో పదివేల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు చేసినందుకు ఎన్డీయే కూటమి నేతలను, కార్యకర్తలను అభినందించారు. కూటమి లో ఉన్న నాయకులు ఏకతాటిపైకి వచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. 

టిడిపి రాష్ట్ర సీనియర్ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య మాట్లాడుతూ ఎన్డీయే కూటమినేతలందరం అన్నదమ్ముల వలె కలిసి మెలసి పనిచేసి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అఖండ విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు.

అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు.

సమావేశంలో కార్పొరేటర్లు కార్పొరేటర్లు మరుపిళ్ళ రాజేష్, మహాదేవు అప్పాజీరావు, గుడివాడ నరేంద్ర రాఘవ, అత్తలూరి ఆదిలక్ష్మి పెదబాబు ఎన్డీయే కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version