04.07.2025
• టీడీపీ కేంద్ర కార్యాలయానికి వివిధ సమస్యలతో వచ్చిన అర్జీదారులు
• అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
తమకు ఉండటానికి ఇల్లు కూడా లేదని.. గతంలో జరిగిన తప్పుడు మ్యాపింగ్ వలన తమ పేరుమీద పొలం లేకపోయిన 33 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తుందని.. దాంతో తల్లికి వందనం నగదు జమ కాలేదని.. దయ చేసి తమ సమస్యను పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం ఓగిరాల గ్రామానికి చెందిన సాధరబోయిన నాగలక్ష్మీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జీ ఇచ్చి అభ్యర్థించారు. ఈ సందర్భంగా అర్జీ స్వీకరించిన ఆయన అధికార్లకు ఫోన్ చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
• యటపాక మండలంలోని ముమ్మడివరం, చలెంపాలెం గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే మొత్తంగా నీట మునిగే ప్రమాదముందని.. భూ సేకరణకోసం గతంలో నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ పట్టించుకోలేదని.. దయ చేసి సర్వే నిర్వహించి తమకు పరిహారం ఇప్పించాలని ఆయా గ్రామస్తులు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
• నంద్యాల జిల్లా ప్యాపిలిమండలానికి చెందిన బి. చిన్నమద్దయ్య గ్రీవెన్స్ లో అర్జీఇచ్చి అభ్యర్థిస్తూ.. తన భూమిని ఆన్ లైన్ ఎక్కేలా సాయం చేయాలని.. అధికార్ల వద్దకు వెళితేపట్టించుకోవడంలేదని వాపోయారు.
• వీటుతో పాటు పలువురు రేషన్ కార్డు సమస్యలు, పింఛన్ సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా.. మరికొందరు ఉద్యోగాలకోసం రెస్యూమ్ లు ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు తమకు పదవులు ఇచ్చి అవకాశం కల్పించాలని అభ్యర్థనలు అందించారు.