అర్చకులకు పురోహితులకు వైసీపీ ప్రభుత్వంలోనే మేలు జరిగింది- ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్

0

అర్చకులకు పురోహితులకు వైసీపీ ప్రభుత్వంలోనే మేలు జరిగింది- ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్

విజయవాడ సత్యనారాయణ పురం లోని టిడిపికి సంబంధించిన కార్యకర్తలు 100 మంది అర్చక పురోహితులు సత్యనారాయణపురం కార్పొరేటర్ శర్వాణి మూర్తి మూర్తి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం అర్చక పురోహితులు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు మంత్రోచ్ఛారణతో ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో వివిధ వర్గాలను ప్రత్యక్షంగా కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అర్చకుల ఇబ్బందులను గమనించిన వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి..అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు. 2019 ఎన్నికల్లో విజయవం సాధించిన తర్వాత వివిధ వర్గాల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నారన్నారు.. ఇందులో భాగంగా ఆలయాల్లో పని చేస్తున్న అర్చకుల సంక్షేమంపై కూడా ప్రత్యేకంగా దృష్టిసారించారు. గత ప్రభుత్వాలు అర్చక పురోహితుల అభ్యున్నతను పూర్తిగా విస్మరించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ శర్మ, మురళి శ్రీనివాస అవధాన్, షణ్ముఖ శర్మ, డాక్టర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version