అమ్మవారి సన్నిధిలో కొనసాగుతున్న శాకంబరీ ఉత్సవాలు
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ ప్రోటోకాల్ అంతరాలయ దర్శనాలు నిలిపివేత
భక్తుల కు ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఈవో శీనా
నాయక్
భక్తులకు కదంబ ప్రసాదం పంపిణీ
విజయవాడ దుర్గ గుడి, జులై 9.
అమ్మవారి సన్నిధిలో ఎంతో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు రెండో రోజు బుధవారం కొనసాగుతున్నాయి.
అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు
శాకంభరిఉత్సవాలు గురువారం ఉదయం 9:30 కు మహా పూర్ణాహుతితో ఉత్సవం పరిసమాప్తి అవుతుంది. కన్నులు విందుగా ఇంద్రకీలాద్రి పై రెండో రోజు అలంకరణ
చేశారు.
భక్తులకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి . ఎలా ఉన్నాయనే విషయాలపై
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఆలయ ఈవో శీనానాయక్. శాకంబరీ దేవి గా దర్శనమిస్తున్న దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు.
,ఇప్పటివరకు ఆలయ అలంకరణ,కదంభం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50టన్నుల పైన కూరగాయల వినియోగం గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుండి సేకరణ కూరగాయల సేకరణ నిమిత్తం 10 రోజులు నుండి శ్రమిస్తున్న ఆలయ సిబ్బంది. ప్రధాన ఆలయం లో శ్రీ కనకదుర్గ అమ్మవారు, మహా మండపం లో ఉత్సవ మూర్తి, ఉపాలయాలల్లో దేవతామూర్తులంతా హరిత వర్ణంతో విరాజిల్లుతున్నారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 వరకు ప్రత్యేక, అంతరాలయ దర్శనం రద్దు అని ప్రకటించిన ఈవో శీనా నాయక్.భక్తులరద్దీ దృష్ట్యా దేవాలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయింపు. మూడవరోజు ముగింపు రోజు పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకునే అవకాశం.