శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ
02 జూలై 2025
అమ్మలగన్నయమ్మ కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ సారె సమర్పణ నిమిత్తం ఆలయం నకు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి కళ కళ లాడింది.
ఇంటి ఆడపడుచుకు ఏ విధంగా సారె సంభారములు పెడతారో అంతకంటే శ్రద్దగా, భక్తి తో భక్త బృందాలు సామాగ్రి తో తరలి వచ్చారు.
ఈరోజు మేళతాళాలు, మంగళ వాయిధ్యాలు నడుమ సుమారు 300మందికి పైగా సభ్యులు గల బృందాలు విశేషరీతిలో విచ్చేశారు.
లిఫ్ట్ మార్గం, మెట్ల మార్గం, మహా మండపం ఆరవ అంతస్తు, అన్న ప్రసాదం వద్ద సిబ్బంది ప్రత్యేక విధులు నిర్వహించి భక్తులకు ఇబ్బంది లేకుండా వ్యవహరించారు.
అమ్మవారికి భక్తులు సమర్పిస్తున్న చీరల గురించి కార్యనిర్వహణాధికారి శీనానాయక్ సిబ్బందిని వివరణ కోరారు. భక్తులు ఇచ్చే చీరలకు కంప్యూటర్లో నమోదు చేసి భద్రం చేస్తున్నామని సిబ్బంది వివరించారు.
భక్తులకు ఉచిత ప్రసాదం, సామూహిక ఆశీర్వచనం అందేలా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు.
సాయంత్రం వరకు సారె సమర్పణ బృందాల రాక కొనసాగింది.