అమెరికాలో మరో విషాదం.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం!

0

 

  • రెండు జెట్ స్కీలు ఢీకొన్న ప్రమాదంలో వెంకటరమణ మృతి
  • వెంకటరమణది తెలంగాణలోని కాజీపేట
  • పర్డ్యూ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న రమణ

అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన విద్యార్థి పిట్టల వెంకటరమణ (27) జెట్ స్కీ ప్రమాదంలో మృతి చెందాడు. రెండు జెట్ స్కీలు ఢీకొనడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. విస్టేరియా ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక జెట్ స్కీని వెంకటరమణ అద్దెకు తీసుకున్నాడు. అక్కడి ఫ్లోటింగ్ ప్లేగ్రౌండ్లో దాన్ని వాడాడు. అయితే అదే సమయంలో మరో జెట్ స్కీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో రెండో జెట్ స్కీని నడుపుతున్నది 14 ఏళ్ల బాలుడని గుర్తించారు.

వెంకటరమణది తెలంగాణలోని కాజీపేట. ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ఇండియానా పోలీస్ లోని పర్డ్యూ యూనివర్శిటీలో హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. మరో రెండు నెలలు ఉంటే అతని చదువు పూర్తయ్యేది. వెంకటరమణ భౌతికకాయాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు వివిధ కారణాలో అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version