అభివృద్ధిని సంక్షేమాన్ని అడ్డుకునేందుకు జగన్ కుతంత్రలు:తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్

2
0

24/7/2025.
19వ,వార్డు,
బడే సాబ్ చెరువు కట్ట, ఎల్ పి బజారు,ఇండియన్ బ్యాంక్ బజారు,
ఉయ్యూరు టౌన్

కూటమి పాలనలో పేదల ప్రజల జీవితాల్లో వెలుగులు:

అభివృద్ధిని సంక్షేమాన్ని అడ్డుకునేందుకు జగన్ కుతంత్రలు::_తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్

ఈరోజుసుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు పట్టణ పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాథరావు ఆధ్వర్యంలో ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో పంతొమ్మిదవ వార్డు లో మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని,కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు సాధించిన ప్రగతిని వివరించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ..
జగన్ ఎన్ని కుతంత్రాలు చేసినారాష్ట్రంలో అభివృద్ధిని ఆపలేరని, చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ అసమర్థ,అరాచక,అవినీతి పాలనకు ప్రజలు భీతి చెందారన్నారు. జగన్ పాలన నచ్చకే ప్రజలు వైసీపీని 11 సీట్లే కే పరిమితం చేశారని అయినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. చంద్రబాబుగారి పాలనానుభవంతో రాష్ట్రానికిరూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, రానున్న మూడేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్, డీఎస్సీ, త్వరలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేస్తున్నామన్నారు. జగన్ హయాంలో రాష్ట్రం ఆర్థిక పతనానికి గురైందనీఅన్నారు. ఇలాంటి వైసీపీ మళ్ళీ వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదని ప్రజలే చెబుతున్నారని అన్నారు.
అనంతరం దివంగత మాజీ ఎంపీటీసీ LP రఫీ గారి జయంతి సందర్భంగా స్తానిక LP మైక్ సెంటర్ లో నివాళులు అర్పించి కేక్ కట్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ వల్లభనేని సత్యన్నారాయణ,మాజీ చైర్మెన్ పూలా ,కుద్దుస్ PACS చైర్మెన్ కూనపరెడ్డి వాసు, హాస్పిటల్ చైర్మెన్ జయదేవ్, శివాలయం చైర్మెన్ కుటుంబరావు, జంపన శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి,l.p. ఇర్ఫాన్ ఆషా,పల్యాల శ్రీను,బూరెల నరేష్,చిరంజీవి, చలపాటి శ్రీను,సురేష్,వడుపు కార్తీక్,సాంబశివరావు,గణేష్,రత్నం బుజ్జి,నజీర్,అయ్యా,భాగ్యరాజు,అప్పల నాయుడు,మీసాల అప్పల నాయుడు,చంటి,చిట్టిమోతు సుబ్బారావు, అల్ రియాజ్,రహీం బెగ్,పటమట వెంకటేశ్వరావు,సలీం,ఆసిఫ్,తిరుపతిరావు, గఫార్,చింతయ్య, నరసింహారావు,సుజిత్ ,సిద్దు,చింతయ్య, బాషా,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వార్డుల కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here