
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా 49 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అడ్డూరి శ్రీరామ్.
తనకు ఓటు వేసి గెలిపించినందుకు
49 వ డివిజన్ ప్రజలందరికీ అడ్డూరి శ్రీరామ్ ధన్యవాదాలు తెలిపారు.
బుధవారం ఆయన డివిజన్ లో కృతజ్ఞతా పూర్వక పర్యటన నిర్వహించారు..
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మరియు,కూటమి శ్రేణులతో కలిసి డివిజన్ పరిధిలోని పలు వీధుల్లో పర్యటిస్తూ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ 49 వ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు..
తన గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడిన కూటమి నాయకులకు కార్యకర్తలకు, మరియు అండగా నిలిచిన ప్రతి ఒక్క ఓటరుకు కృతజ్ఞతలు తెలిపారు.
![]()
