విజయవాడ, తేదీ: 04.08.2025
• అన్ని మున్సిపాల్టీల్లో ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి
• స్వచ్చాంధ్ర ప్రదేశ్ కోసం స్వయంగా సీఎం చంద్రబాబు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు
• ఈ ఏడాది డిసెంబన్ నెలాఖరుకు లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్ గా ఏపీని మారుస్తాం
• గత ప్రభుత్వంలో దెబ్బతిన్న సంబంధాలను సరిచేసేందుకు సీఎం సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడారు
• అమరావతి నిర్మాణంలో టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు సింగపూర్ ముందుకొచ్చింది
– పొంగూరు నారాయణ, పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి
ఈ ఏడాది డిసెంబర్ చివరకల్లా రాష్ట్రాన్ని లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్ గా మారుస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిపోయిన చెత్తతో పాటు కొత్తగా వచ్చిన 20 లక్షల టన్నుల చెత్తను డిసెంబర్ నాటికి పూర్తిగా తొలగిస్తామన్నారు. రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణకు కమిషనర్లు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు… స్వచ్చ నగరాల సాధన కోసం ప్రజల్లో కల్పించాల్సిన అవగాహనపై స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో IEC, కెపాసిటీ బిల్డింగ్ పై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు… అనంతరం మీడియాతో మంత్రి పి. నారాయణ మాట్లాడాటుతూ రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు సాలిడ్ వేస్ట్,లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు…చెత్త రహిత నగరాలుగా మార్చేందుకు మున్సిపల్ కమిషనర్లు కీలక పాత్ర వహించాలన్నారు… స్వచ్చ భారత్ కింద స్వచ్చాంధ్ర సాధనకు అధికారులు, ప్రజలంతా కలిసి పనిచేయాలన్నారు… ప్రతి నెలా మూడో శనివారం సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు… ఏదో ఒక ప్రాంతంలో స్వయంగా పాల్గొంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారన్నారు… స్వచ్చాంధ్ర సాధనకు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వారి సహకారం కావాలన్నారు… కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్వచ్చతా నాలెడ్జ్ పార్టనర్స్ తో కలిసి మున్సిపల్ కమిషనర్లు చర్చించుకుని వాటిని కింది స్థాయిలో అమలుచేసేలా చర్యలు చేపట్టాలన్నారు…. రాష్ట్రంలోని 5 నగరాలకు స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు రావడం గర్వకారణంగా ఉందన్నారు… అవార్డులు సొందిన మున్సిపాల్టీల అధికారులు, సిబ్బందికి మంత్రి నారాయణ అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిపోయారన్నారు. ఈచెత్తనంతా వచ్చే అక్టోబర్ రెండో తేదీ నాటికి పూర్తిగా తొలగిస్తామన్నారు.. మరోవైపు కొత్తగా వచ్చిన 20 లక్షల టన్నుల చెత్తను కూడా డిసెంబర్ నాటికి పూర్తిగా తొలగించి లెగసీ వేస్ట్ ఫ్రీ స్టేట్ గా మారుస్తామన్నారు… రాష్ట్రంలోని ప్రతిరోజూ వచ్చే ఘన వ్యర్ధాలను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లకు తరలిస్తున్నామన్నారు.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం, గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లతో పాటు కొత్తగా కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతిలో కూడా ప్లాంట్ లు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు… ఈ ప్లాంట్ లన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్రం డంపింగ్ యార్డ్ రహితంగా మారుతుందన్నారు. అలాగే ద్రవ వ్యర్ధాల నిర్వహణ కోసం సీవరేజి ట్రీట్ మెంట్ ప్లాంట్లు రెండేళ్లలో ఏర్పాటుచేస్తామన్నారు… అమృత్ పథకం నిధులతో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు పూర్తిచేస్తామని చెప్పారు… గత ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ కు ఏపీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు.
2014-19 మధ్య కాలంలో సింగపూర్ లోని మెజారిటీ షేర్ ఉన్న కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు…. గత ప్రభుత్వం ఆ అగ్రిమెంట్ ను రద్దు చేయడంతో పాటు సీఐడీ అధికారులను పంపి విచారణ జరిపించారని అన్నారు.. దీంతో ఆ ప్రభుత్వంతో ఏపీకి ఉన్న సంబంధాలు దెబ్బతాన్నాయన్నారు. తిరిగి ఆ సంబంధాలు పునరుద్దరించడానికే సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారని అన్నారు… సింగపూర్ ప్రభుత్వాధికారులు ఎంతో పాజిటివ్ గా స్పందించారన్నారు. సింగపూర్ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు అంటే ఎంతో గౌరవం ఉందన్నారు.. .అయితే ప్రపంచ బ్యాంకుతో కలిసి అమరావతికి సహకారం అందించేందుకు సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు… అలాగే సింగపూర్ కంపెనీలను విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని సీఎం ఆహ్వానించినట్లు తెలిపారు… తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో సీఆర్డీఏ కమిషనర్ అధికారికంగా లెటర్ రాసిన తర్వాత సంప్రదింపులు చేస్తారని మంత్రి నారాయణ అన్నారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ మున్సిపాల్టీల అభివృద్ధికి దేశం లో 3 అత్యుత్తమైన ఏజెన్సీలు గుర్తించి ఎంపిక చేశామన్నారు. 123 నగరాల్లో స్వచ్ఛత పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. స్వఛ్చ సర్వేక్షణ్ లో 5 అవార్డ్ లు రావడం మనకు గర్వకారణమన్నారు. రాష్ట్రం లో ఒక రీసైక్లింగ్ పార్క్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ముందుకు తీసుకు వెళ్లుతున్నామన్నారు. స్వచ్ఛ సేవలో నిధులు కొరత లేకుండా కేంద్రం, రాష్ట్రం నిధులు కేటాయిస్తోందన్నారు. ప్రతి నిత్యం పని ధ్యాసగా ఉండే నాయకులు చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ అని అన్నారు. స్వచ్ఛత కోసం దేశంలో ఉన్న ఒకే ఒక కొలమానం స్వచ్చ సర్వేక్షణ్ అని అన్నారు. ప్రతి సిటీ రిపోర్టు కార్డు ఆన్ లైన్ లో ఉన్నాయన్నారు. టాప్ ఫిప్టీలో రాష్ట్రం నుండి 6 నగరాలు ఉన్నాయన్నారు. దక్షణ భారత దేశంలో స్వచ్చతలో కొంత మేరకు మనం మెరుగ్గానే ఉన్నామన్నారు. రూ. 1146 కోట్ల బడ్జెట్ లో విశాఖ, విజయవాడ నగరాలే పారిశుధ్యంపై రూ. 340 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. జీవో ప్రకారం యూఎల్ బి లు తమ బడ్జెట్ లో 27 శాతం ఖర్చు చేయాలన్నారు. రూ. 100 కోట్లు పైగా చెత్త సేకరణకు డీజిల్ పై ఖర్చు చేస్తుంటే, విజయవాడలో వాహనాల డీజిల్ కోసం రూ. 30 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. వ్యయం తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా 2,000 ఎలక్ట్రిక్ వెహికిల్స్ డోర్ టూ డోర్ చెత్త సేకరణ కోసం కొనుగోలు చేస్తున్నామన్నారు.
మున్సిపల్ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీలో స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు రాష్ట్రంలోని అయిదు నగరాలకు వచ్చాయన్నారు. సూరత్, లక్నో వంటి నగరాలు ఒకప్పుడు మురికి నగరాలు అయితే ఈరోజు అవి క్లీన్ సిటీలుగా తయారయ్యాయన్నారు. శానిటేషన్ అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదు ప్రజల కార్యక్రమమే అన్నారు. అప్పుడే ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయన్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ కావాలంటే పై నుండి కింది వరకూ అందరికి ట్రైనింగ్ అవ్వాలన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. స్వఛ్చభారత్ మిషన్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వఛ్చ సర్వేక్షణ్ పై ఏర్పాటు చేసిన గ్రూప్ ఆప్ మినిష్టర్ లకు గతంలో నాయకత్వం వహించి ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారన్నారు. క్లీన్ స్టేట్ , గ్రీన్ స్టేట్ అనేది స్వర్ణాంద్రకు ఎంతో అవసరమన్నారు.
పురపాలక శాఖ సంచాలకులు పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్లు ఉదయమే మున్సాపాలిటీల్లో పనులను తనిఖీ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బందికి డెత్ ఇన్సూరెన్స్ వర్తించే విధంగా 20 లక్షల వరకు జనరల్ ఇన్యూరెన్స్ వర్తించే విధంగా యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు.
ముందుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు