రాత్రి సమయాలలో దొంగతనాలు చేయు అంతర్ రాష్ట్ర పాత నేరస్థుడు అరెస్ట్

0

 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయం, నందిగామ, ఎన్. టి. ఆర్. జిల్లా. *తేదీ. 07.03.2025.

 రాత్రి సమయాలలో దొంగతనాలు చేయు అంతర్ రాష్ట్ర పాత నేరస్థుడు అరెస్ట్

 చైన్ స్నాచింగ్ కేసులో మరో నిందితుడు అరెస్ట్

 నిందితుడు వద్ద నుండి Rs.20 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు (220 గ్రాముల) స్వాధీనం

 పోలీస్ కమిషనర్ ఎస్.వి రాజశేఖర్ బాబు ఐ.పి.ఎస్ గారు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ పోలీస్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఎన్.టి.ఆర్.జిల్లా నందు దొంగతనాలు మరియు ఇతర నేరాలు జరుగకుండా నేర రహిత జిల్లాగా తీర్చిదిద్ది నగర ప్రజలకు మర్రిన్ని సేవలను అంధిచాలనే సదుద్దేశంతో సాంకేతిక పరిజ్ఞానంను ఆయుధంగా చేసుకుని ఎన్.టి.ఆర్ పోలీసు కమిషనరేట్ ను సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికె తలమానికంగా నిలబెట్టాలనే ధ్యేయంతో స్మార్ట్ గా వ్యవహరిస్తూ టెక్నాలజీని ఉపయోగిస్తూ పలు అద్బుతమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

ఈ కృషిలో బాగంగా 1.⁠ ⁠E-Pahara, 2. Cyber citizens, 3.⁠ ⁠AsTram, 4. Victim compensation, 5. Cloud Petrols (Drone camera flying), 6. Traffic Ambassadors, 7. Falcon, 8. Cheruva, మొదలగు కార్యక్రమాలతో ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ ప్రజలకు విశేష సేవలనిస్తుంది.

 ఈ నేపధ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన సి.సి.కెమెరాల నిడివి ఆధారంగా చేసుకుని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని అనుమానితుని కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో నందిగామ సబ్ డివిజన్ పరిదిలో జరిగిన రాత్రి సమయంలో జరిగిన దొంగతనం కేసులో నేరం చేసిన అనుమానితుడి కదలికలపై రూరల్ డి.సి.పి. కె.ఎం. మహేశ్వర రాజు ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో నందిగామ సబ్ డివిజన్ ఎ.సి.పి. తిలక్ ఆద్వర్యంలో జగ్గయ్య పేట ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు వారి సిబ్బందితో కలిసి పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.

 ఈ క్రమంలో జగ్గయ్య పేట ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు కి రాబడిన పక్కా సమాచారం మేరకు ఈ రోజు జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలోని గరికపాడు చెక్ పోస్ట్ సమీపంలో నింధితుడిని అదుపులోనికి తీసుకుని విచారించి అతని వద్ద నుండి సుమారు 20 లక్షల విలువైన 220 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది.

నిందితుని వివరాలు: తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం అర్బన్ పాండురంగపురం గ్రామానికి చెందిన సంపతి ఉమా ప్రసాద్ @ ఉమా (24సం.)

 నింధితుడు ఇంటర్ వరకు చదువుకున్నాడు, చిన్న నాటి నుండే చెడు సావాసాలు చేసి తన జల్సాల కోసం తాళం వేసి ఉన్న ఇళ్లలోకి ఇంటిలోని డబ్బు బంగారాన్ని దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు, ఈ క్రమంలో వివిధ పోలీసు స్టేషన్ లలో అరెస్టు కాబడి మైనర్ కింద విడుదలైనాడు. ఈ క్రమంలో విడుదలైన తరువాత కూడా తన జల్సాల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని పగటి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించడం వాటిని రాత్రి సమయాలలో తాళం పగలగొట్టి ఇళ్లలోకి ఇంటిలోని డబ్బు బంగారాన్ని దొంగతనం చేయడం వంటివి చేస్తున్నాడు. ఈ విధంగా ఎక్కడా దొరకాకుండా చాలా తెలివిగా నేరాలు చేయడం వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. 

 ఈ విధంగా ఇతనిపై ఆంద్రప్రదేశ్, తెలంగాణా మరియు కేరళ రాష్ట్రాలలో మొత్తం 32 దొంగతనం కేసులు కలవు. వీటిల్లో 25 కేసులలో నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) లు పెండింగ్ లో ఉన్నాయి. మరో 12 కేసులలో అరెస్టు పెండింగ్ లో ఉన్నాడు. ఇతను కేరళ, ఖమ్మం, మరియు సూర్యాపేట జిల్లాల పరిదిలోని పలు పోలీసు స్టేషన్ లలో అరెస్టు కాబడి జైలుకు వెళ్ళి వచ్చినాడు. అక్టోబర్-2024 నెలలో ఖమ్మం జైలు నుండి విడుదలైనాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం ఐదు నెలల కాలంలో తెలంగాణా మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలో సుమారు 12 దొంగతనాలు చేసినాడు. ఈ క్రమంలో ది. 19.02.2025 తెధీన జగ్గయ్యపేట పోలీసు స్టేషన్ పరిది లో దొంగతనం చేసినాడు. ఈ నేపధ్యంలో నగరంలో ఏర్పాటు చేసిన అత్యాదునిక సి.సి.కెమెరాలలో నింధితుడి కదలికలను గుర్తించడం జరిగింది.

 ఈక్రమం లో దొంగతనం చేసిన వస్తువులు ఈరోజు నందిగమలో అమ్ముదామని వెళ్తుండగా జగ్గయ్యపేట ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు కి రాబడిన పక్కా సమాచారం మేరకు ఈ రోజు జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలోని గరికపాడు చెక్ పోస్ట్ సమీపంలో నింధితుడిని అదుపులోనికి తీసుకుని విచారించి అతని వద్ద నుండి సుమారు 20 లక్షల విలువైన 220 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది.

చైన్ స్నాచింగ్ కేసులో మరో నిందితుడు అరెస్ట్:

 ఈ క్రమంలో జగ్గయ్య పేట పోలీసు స్టేషన్ పరిదిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులోని మరో ముద్దాయి అయిన తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ముత్తవరం గ్రామానికి చెందిన గలంజీపల్లి శేఖర్ (27సం.) అనే నింధితుదిని అదుపులోనికి తీసుకుని విచారించి అతని వద్ద నుండి మరో 36 గ్రాముల బంగారపు గొలుసును స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది.

 తక్కువ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి పలు కేసులలో ముద్దాయి అయిన అంతర్ రాష్ట్ర పాత నేరస్థుడుని అరెస్ట్ చేయడం మరియు నింధితుని వద్ద నుండి పూర్తి చోరీ సొత్తును స్వాదీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన జగ్గయ్య పేట ఇన్స్పెక్టర్ P.వెంకటేశ్వర్లు మరియు జగ్గయ్యపేట SI లు, G.రాజు, B.E.వెంకటేశ్వరరావు లను, వారి సిబ్బందిని నగర పోలీసు కమిషనర్ అభినంధించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version