మేయర్ టికెట్ ఇవ్వండి

Spread the love

మేయర్ టికెట్ ఇవ్వండి

కాంగ్రెస్ పార్టీలో 2024 నుండి కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా సేవలు అందించడానికి అవకాశం ఇచ్చిన నాకు మేయర్ టికెట్ ఇవ్వవలసింది గా మొహమ్మద్ హాజీ సర్వర్ బేగ్ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాని తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 1995 లో వనస్థలిపురం ఏరియాలో క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేశానన్నారు. 1996 నుండి విజయవాడలో వంగవీటి మోహన్రంగా అనుచరులు మరియు సహచరులు గొట్టు ముక్కలు వెంకటేశ్వర రావు ,ఎం.కే బేగ్ ,జలీల్ ఖాన్ మరియు v.m రంగా ముఖ్య అనుచరుడు మల్లాది విష్ణుతో కలిసి కాంగ్రెస్ పార్టీకి సేవలందించానన్నారు. 2000 సంవత్సరం పాత 46 డివిజన్లో కార్యదర్శిగా పనిచేశానని, 2009లో సెంట్రల్ నియోజకవర్గంలో క్రియాశీలకగా ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు ను గెలిపించడం జరిగిందన్నారు. 2010 లో నా కష్టాన్ని చూసి పాలకవర్గ సభ్యులుగా వర్క్ బోర్డ్ కు కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసిందన్నారు. 2014లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనరల్ సెక్రెటరీగా మైనార్టీ డిపార్ట్మెంట్ లో పనిచేశానని, 2016లో విజయవాడ ప్రధాన కార్యదర్శి పని చేశానన్నారు. 2018 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చైర్మన్ మైనారిటీ దీప్తిలో పనిచేశానని, 2020 సం” 57 డివిజన్ లో మా అమ్మకు కార్పొరేటర్ గా టికెట్ ఇచ్చారన్నారు.2021 లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ చైర్మన్ మైనార్టీ డిపార్ట్మెంట్ లో పనిచేశానని , 2026 వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో సేవ చేయుటకు అవకాశం ఇచ్చిన నాకు 2026 లో మేయర్ గా పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ పార్టీనిమొహమ్మద్ హాజీ సర్వర్ బేగ్ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

Loading