పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజా శేఖర బాబు ఐ.పి.ఎస్. ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్. టి. ఆర్. జిల్లా కు కేటాయించబడిన నూతన ప్రొబేషనరీ ఎస్.ఐ.లు

5
0

 ఎన్. టి. ఆర్ . జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా తేదీ. 03.03.2025.

నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజా శేఖర బాబు ఐ.పి.ఎస్. ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్. టి. ఆర్. జిల్లా కు కేటాయించబడిన నూతన ప్రొబేషనరీ ఎస్.ఐ.లు

 అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనరేట్ కు కేటాయించిన 56 మంది ప్రొబేషనరీ ఎస్.ఐ.లు ఈ రోజు పోలీసు కమిషనర్ కార్యలయం నందు నగర పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజా శేఖర బాబు ఐ.పి.ఎస్. ని మర్యాదపూర్వకంగా కలిసినారు. ఈనేపధ్యంలో నగర పోలీసు కమిషనర్ నూతనంగా పోలీస్ శాఖలోకి అడుగుపెడుతున్న ప్రొబేషనరీ ఎస్సైలకు హృదయపూర్వక అభినందనలు తెలిపినారు.

 ఈ సంధర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమశిక్షణ, నిజాయతీ, పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ, బాధితులకు న్యాయం, ముద్దాయిలకు శిక్షలు కల్పించేలా పని చేయాలని సూచించారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులను నిర్వర్తించాలని సూచించారు

 ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వీధి నిర్వహణలో టెక్నాలజీ ని ఉపయోగించి ఉత్తమ ఫలితాలను రాబట్టి ప్రజలకు మరింత సేవ చేసేలాగా చూడాలని, పి.జి.ఆర్.ఎస్. ఫిర్యాదులను అప్లోడ్ చేయు విధానం, ఎఫ్.ఐ.ఆర్., ధర్యాప్తుకు సంబందించిన రికార్డులను రాయడం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి, కేసులను ఏవిధంగా చేధించాలి, సి.సి.టి.ఎన్.ఎస్., డ్రోన్స్ ను ఉపయోగించడం, క్లౌడ్ పెట్రోలింగ్, సి.సి.కెమెరాలను ఉపయోగించు విధానం గురించి, అస్త్రం యాప్ గురించి, ఈ పహరా బీట్ గురించి, ఎన్.డి.పి.ఎస్. కేసులలో చేయవలసిన విధుల గురించి, కేసు డైరీ రాయడం, నేర స్థలాన్ని ఏవిధంగా పరిశోధించాలి, బంధోబస్త్ ఏవిధంగా వేయాలి, ఏ విధంగా నిర్వహించాలి, పోలీస్ స్టేషన్ నిర్వహణ, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ క్రైమ్ రికార్డ్స్ లను ఏ విధంగా నిర్వహించాలి మొదలగు అంశాల గురించి క్షుణ్ణంగా నేర్చుకోవాలని, ఎక్కడా ఏవిధమైన అనుమానం వచ్చిన వెంటనే సీనియర్ అదికారులను అడిగి తెలుసుకుని నివృత్తి చేసుకోవాలని తెలియజేశారు

 ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ తోపాటు డి.సి.పి.లు గౌతమి షాలి ఐ.పి.ఎస్ తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్, కె.జి.వి. సరిత ఐ.పి.ఎస్. ఏ.బి.టి.ఎస్. ఉదయారాణి ఐ.పి.ఎస్ కృష్ణ మూర్తి నాయుడు ఎస్.వి.డి.ప్రసాద్ గుణ్ణం రామకృష్ణ ఏ.ఆర్.ఏ.సి.పి. డి.ప్రసాద రావు నూతన ప్రొబేషనరీ ఎస్.ఐ.లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here