సితార సెంటర్ బైపాస్ రోడ్డు వద్ద ఫుడ్ కోర్టును వ్యతిరేకిస్తున్నాం.
జాతీయ రహదారి మీద ఫుడ్ కోర్టును ఏ విధంగా ఏర్పాటు చేస్తారో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి అనుమతులు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి అధికారులు పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు సమాధానం చెప్పాలి.
సితార సెంటర్ బైపాస్ రోడ్డు వద్ద ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం వలన ఒకరిద్దరు వ్యక్తులకు తప్ప ఇటు చిరు వ్యాపారస్తులు గాని అటు కార్పొరేషన్ గాని ఉపయోగం లేదు.
గతంలో వీడియోలతో సహా బయటపెట్టాం సితార సెంటర్ వద్ద నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ వరకు పదుల సంఖ్యలో బార్లుమరియు వైన్ షాపులు ఉన్నాయి. వారికి టచ్చింగ్ కోసం ఈ ఫుడ్ కోర్ట్ ని ఏర్పాటు చేస్తున్నారా ?సుజనా చౌదరి మీరు సమాధానం చెప్పాలి.
ఈ ఫుడ్ కోర్ట్ వలన భవానిపురం విద్యాధరపురం ఏకలవ్య నగర్ ఊర్మిళా నగర్ కబేలా సెంటర్ తదితర ప్రాంతాల్లో చిరు వ్యాపారస్తులకు తీవ్ర నష్టం ఏర్పడుతుంది.
ఇళ్ల దగ్గర ఇడ్లీలు అట్లు అమ్ముకొని జీవనం సాగించే వారికి ,పుల్కా బండ్ల వారికి ,నూడిల్స్ బండ్లు వారికిజీవనోపాధి కోల్పోయి వారు రోడ్లపై పడే ప్రమాదం ఉంది.
ఇప్పటికే సితార సెంటర్ నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ వరకు ఉన్న మద్యం షాపులు బార్ల వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే గంజాయి డ్రగ్స్ బ్లేడ్ బ్యాచ్ వారికి అడ్డా గా మారే ప్రమాదం ఉంది. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది.
అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రజలు ప్రమాదాలు బారిన పడే అవకాశం తీవ్రంగా ఉంది కావున వెంటనే అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే ఈ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తున్నాం.
ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కేవలం కొద్ది మంది ప్రయోజనాల కోసం ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే కచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం.
పోతిన వెంకట మహేష్, వైఎస్ఆర్సిపి నాయకులు విజయవాడ పశ్చిమ గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్