ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఆపన్న హస్తం
బోన్ మ్యారోతో బాధపడుతున్న రోగికి రూ 50 వేలు ఆర్థిక సాయం..
బోన్ మ్యారోతో తీవ్ర అనారోగ్యానికి గురై
ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న మహమ్మద్ ఖాదర్ షఫీ ( 26) కు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆపన్న హస్తం అందించారు..
41 వ డివిజన్, భవానిపురానికి చెందిన మహమ్మద్ ఖాదర్ షఫీ బోన్ మ్యారోతో బాధపడుతు గత కొద్ది రోజులుగా
ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
విషయం తెలుసుకున్న
మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తెలియజేశారు..
రోగి పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే సుజనా ఎన్.ఆర్. ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు.. తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం
రూ 50 వేలను అందించాలని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను ఆదేశించారు..
మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు..
సుజనా ఆదేశాలతో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ శుక్రవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు , మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, కూటమి నేతలతో కలిసి బాధితుడి సోదరుడు మెయిన్ కు
రూ 50 వేలను అందించారు ..
త్వరితగతిన స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం సాయం చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు..
ఎన్డీఏ కూటమి నేతలు అలుగుండ్ల సుబ్బారెడ్డి, బొల్లేపల్లి కోటేశ్వరరావు, గన్నవరపు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు..