ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి శుభవార్త చెప్పారు.

0

 ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి శుభవార్త చెప్పారు.

గతంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఆగష్టు 2023 నుంచి 2024 ఆగస్టు వరకు వాలంటీర్లకు రెన్యువల్ చేయలేదన్నారు.

రెన్యువల్ లేకుండానే ఉద్యోగాలు చేస్తున్నారని.. వాలంటీర్లు విధులు తాము ఎప్పుడూ తొలగించ లేదన్నారు.

జగన్ పాప పుణ్యమే వారి జీతాలు ఆగాయని.. తాము ఇస్తామన్నారు.

తాము వాలంటీర్లుకు ధృవీకరణ చేయబోతున్నామని ప్రకటించారు మంత్రి. రాష్ట్రంలో వాలంటర్ వ్యవస్థను తొలగిస్తామంటూ వస్తున్న ప్రచారాన్ని మంత్రి స్వామి ఖండించారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి. వైఎస్సార్‌‌సీపీ ప్రభుత్వం వాలంటీర్లను రాజకీయంగా ఉపయోగించుకుందన్నారు. వాలంటీర్ల భవిష్యత్తును దెబ్బకొట్టేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. గత ప్రభుత్వం ఏడాది కాలంగా వాలంటీర్‌ సేవలను రెన్యూవల్‌ చేయకుండా వారిని మోసం చేశారన్నారు. త్వరలోనే వాలంటీర్ల ఉద్యోగాలను రెన్యువల్ చేస్తామని ప్రకటించారు. వాలంటీర్ల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version