విజయవాడ
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
- రాష్ట్రంలో 25 మంది లోక్ సభ ఎంపీలు, 11 మంది ఎంపీలు పేరుకు మాత్రమే
- విభజన సమస్యల మీద నోరు విప్పే దమ్ము ఒక్కరికి లేదు.
- రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అందరూ బీజేపీ ఎంపీలే
- బీజేపీ బిల్లులకు మేము సిద్ధం అంటూ రాష్ట్ర ఎంపీలు పోటీ పడుతున్నారు
- 11 ఏళ్లుగా విభజన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి
- అందరూ మోడీ మెప్పు కోసమే
- మోడీ దగ్గర పోటీ పడుతున్నారు
- రాష్ట్ర విభజన సమస్యల మీద ఒక్కరు మాట్లాడే వారు లేరు
- అందరు బీజేపీ తొత్తులే.
- బీజేపీ చేతుల్లో కీలు బొమ్మలు
- మోడీ చేతిలో రబ్బర్ స్టాంప్స్
- మన ఎంపీలు పార్లమెంట్ కి మోడీ భజన కోసం హాజరు అవుతున్నారు
- ప్రత్యేక హోదా విభజన హామీ
- మోడీ 10 ఏళ్లు హోదా ఇస్తాం అన్నారు
- చంద్రబాబు 15 ఏళ్లు కావాలని అడిగి హోదా ఏమైనా సంజీవని నా అన్నాడు
- ప్రత్యేక ప్యాకేజీ 70 వేల కోట్లతో వస్తుంది అన్నారు
- హోదా లేదు చివరికి ప్యాకేజీ లేదు
- హోదా వచ్చి ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఇంకోలా ఉండేది
- ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇచ్చిన హామీ
- ప్రత్యేక హోదా మీద మోసం చేసిన మోడీ ఒక కేడీ
- రాష్ట్రంలో ఇక హోదా అనే అంశం లేనే లేదు.
- హోదా అడగకుండా మరిపిస్తున్నారు
- రాష్ట్ర ఎంపీలకు చీము నెత్తురు ఉంటే…దమ్ము ధైర్యం ఉంటే..హోదా మీద తాడో పేడో తేల్చండి
- పోలవరం జాతీయ హోదా ప్రాజెక్ట్
- 11 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్ట్ జీవం తీసేశారు
- 25 వేల కోట్లు మిగిలించేందుకు పోలవరం ఎత్తు తగ్గించారు
- పోలవరం ప్రాజెక్ట్ ను చివరికి నీటి నిల్వ ప్రాజెక్ట్ కింద మార్చారు
- పోలవరం కి అన్యాయం జరుగుతుంటే ఒక్క mp కూడా నోరు విప్పడం లేదు
- కేంద్రమే రాజధాని నిర్మించాలి.
- విభజన చట్టంలో హామీ ఉంది.
- డిల్లీ లాంటి రాజధాని అన్నారు..సింగపూర్,ఇస్తాంబుల్ అన్నారు.
- చివరికి నిధులు బదులు అప్పులు ఇస్తున్నారు
- 15 వేల కోట్లు అప్పులు ఇచ్చి బీజేపీ ఉద్ధరించి నట్లు గొప్పలు చెప్తుంది
- రాష్ట్ర ఎంపీలు దమ్ముంటే రాజధాని మీద పూర్తి స్థాయి నిధులు మోదీని అడగాలి
- రాజధానిపై పార్లమెంట్ లో నిలదీయాలి
- కడప స్టీల్, దుగరాజపట్నం పోర్ట్ కలగానే మిగిలింది
- కడప స్టీల్ శంకుస్థాపనల ప్రాజెక్ట్ గా మార్చారు
- నలుగురు ముఖ్యమంత్రులు మారినా పరిస్థితి అలానే ఉంది
- కడప స్టీల్ sail కట్టించి ఇవ్వాల్సిన ప్లాంట్
- ఇప్పుడు కడప స్టీల్ ను జిందాల్ కి అప్పజెప్పారు
- ఇండస్ట్రియల్ కారిడార్ అమలు కాలేదు
- వెనుక బడిన ప్రాంతాలకు 25 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ రావాలి
- కేంద్రం ముష్టి వేసినట్లు పదో పరక ఇస్తుంది
- రాష్ట్ర ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం
- రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడండి
- సభను స్తంభింప జేయండి
- విభజన హక్కుల మీద కొట్లాడండి
- పార్లమెంట్ లో కాంగ్రెస్ కి బలం ఉంది
- కాంగ్రెస్ రాష్ట్రం నుంచి బలం లేదు కదా
- ఇక్కడ స్థానిక ఎంపీలు రాష్ట్రం గురించి మాట్లాడాలి
- మన ఎంపీలకు ఆ బాధ్యత ఉంది
- మిగతా రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు వాళ్ల రాష్ట్ర ఇష్యూలు మాట్లాడుతారు
- మన రాష్ట్ర ఎంపీలు గాడిదలు కాస్తున్నారు
- ప్రత్యేక హోదా నాకు రాజకీయం కాదు
- హోదా వల్ల నా సొంత ప్రయోజనం లేదు
- హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది
- విశాఖ స్టీల్ అమ్మేస్తున్నారు
- విశాఖ స్టీల్ అమ్ముతుంటే ఎంపీలు కళ్ళుమూసుకున్నారు
- విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ మీద ఒక్కడు మాట్లాడటం లేదు
- మోడీ తో ప్రైవేటీకరణ లేదు అని ఒప్పించడం లేదు
- మాకు హామీ ఇవ్వండి అని అడగడం లేదు
- రాష్ట్ర ఎంపీలు స్వార్ధం కోసం పని చేస్తున్నారు
- రాష్ట్రంలో గత 15 రోజులుగా యూరియా కొరత ఉంది
- రాష్ట్రానికి 40 వేల టన్నులు మాత్రమే వచ్చింది
- ఇంకా 80 వేల టన్నులు రావాలి
- 20 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు
- రైతులు గగ్గోలు పెడుతుంటే పార్లమెంట్ లో కేంద్రాన్ని అడిగే సత్తా లేదు
- సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్
- ఆగస్ట్ 15 న మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు
- ఉచిత బస్సు పథకం జిల్లాల వరకే పరిమితం అంట
- చిన్న పథకం కి ఇన్ని కొర్రీలు ఎందుకు ?
- రాష్ట్రం మొత్తం ఉచిత ప్రయాణం కల్పిస్తే మీకు జరిగే నష్టం ఏంటి ?
- రాష్ట్రంలో 16 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారని rtc చెప్తుంది
- ఒక జిల్లా నుంచి మరో జిల్లా కి వెళ్లడానికి ఉచితం ఎందుకు ఇవ్వరు ?
- రాష్ట్రం మొత్తం ఉచితంగా ప్రయాణం కల్పించండి
- మహాశక్తి పథకాన్ని మోసం చేశారు
- ఈ పథకాన్ని అమ్మాలి అంటే రాష్ట్రాన్ని అమ్మలట
- హామీలు ఇచ్చే ముందు ఈ పథకం భారం అని తెలియదా ?
- రెండు కోట్ల మంది మహిళలను మోసం చేశారు
- మానిఫెస్టో అంటే 5 ఏళ్లకు సరిపడే హామీలు
- ఇష్టం వచ్చినప్పుడు అమలు చేసేది కాదు
- రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చంద్రబాబు కి తెలుసు
- జగన్ దోచుకు తిన్నాడు అని తెలుసు
- అన్ని తెలిసి చంద్రబాబు హామీ ఇచ్చారు
- ఇప్పుడు అమలు చేయము అంటే మీకు బాధ్యత లేదు అని అర్థం
- చంద్రబాబు తీరు ఓడ దాటేదాకా ఓడ మల్లన్న … ఓడ దాటాక బోడి మల్లన్న
- నిరుద్యోగ భృతి అని నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారు
- 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అనేది తెలియదు