వృద్ధురాలికి వినికిడి యంత్రం అందజేత
53 వ డివిజన్ కొత్తపేట కు చెందిన నాగోతి సాయి మణి( 72 ) కు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో తో కలిసి భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కేంద్ర సామాజిక న్యాయ శాఖ, మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం ద్వారా వికలాంగులకు, వినికిడి సమస్యలు ఉన్నవారికి ఉపకరణాలను అందజేస్తున్నారు.
పశ్చిమ నియోజకవర్గంలోని వికలాంగులను గుర్తించి వారికి పరికరాలు అందేలా ఎన్డీఏ కూటమి నేతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. టీడీపీ నాయకులు దీటి ప్రభుదాస్ నాగోతి సాయి మణి కు వినికిడి యంత్రం అందజేయాలని ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేశారు.కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని అడ్డూరి శ్రీరామ్ తెలిపారు.
వినికిడి సమస్యతో బాధపడుతున్న నాగోతి సాయి మణి కు వినికిడి యంత్రం బహుకరించడంతో ఆవిడ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సుజనా చౌదరి కు కృతజ్ఞతలు తెలిపింది..
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పులి చేరి రమేష్, అవ్వారు బుల్లబ్బాయి, పచ్చి పులుసు శివప్రసాద్,యలకల అనిల్, తమ్మిన శ్రీను సుజనా మిత్రా కోఆర్డినేటర్లు సప్పా శ్రీనివాస్, కొల్లి దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.