జాతీయ వాదం, సాంస్కృతిక వాదం కలబోస్తే కోట శ్రీనివాసరావుసంతాప సభ లో వక్తల భాషణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్

2
0

భారతీయజనతాపార్టీ
ఆంధ్రప్రదేశ్

జాతీయ వాదం, సాంస్కృతిక వాదం కలబోస్తే కోట శ్రీనివాసరావు
సంతాప సభ లో వక్తల భాషణ

కోట శ్రీనివాసరావు గొప్ప జాతీయ వాది… బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్

పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇళ్లు నిర్మాణానికి ఆద్యుడు కోట శ్రీనివాసరావు… వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్

మాజీ శాసనసభ్యులు ప్రముఖ సినీ నటులు కీ” శే”శ్రీ కోట శ్రీనివాసరావు కి ఘనమైన నివాళులు

విలక్షణ నటనతో, సినీ రంగంలో, జనగుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న
పద్మశ్రీ అవార్డు గ్రహీత, మాజీ శాసనసభ్యులు
కీర్తి శేషులు కోట శ్రీనివాసరావు శ్రద్ధాంజలి సభ.

తేదీ: 25-07-2025, శుక్రవారం సమయం: ఉదయం 10:30 గంటలకు
స్థలం: హోటల్ ఐలాపురం కన్వెన్షన్ హాల్, గాంధీనగర్, విజయవాడ నందు NTR జిల్లా BJP అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి,నవరస నటన సార్వభౌముడు,పద్మ కోటా శ్రీనివాసరావు మరణం మనందరిరికి తీరని లోటని,ఆయన భారతీయజనతాపార్టీ మాజీ MLA గా, హిందుత్వ వాదిగా,సామాజిక వేత్తగా ,సినీ రంగంలో ఆర్టిస్టులకు అండగా వుంటూ,తెలుగు చిత్ర పరిశ్రమలో పక్క రాష్ట్రాల అర్టిస్టుల ఆదిపత్యాన్ని వ్యతిరేకిస్తూ,ప్రకాష్ రాజు వంటి హిందూ వ్యతిరేకులను నిలదీస్తూ,భారతీయజనతాపార్టీ సిద్దాంతాలను,హిందుత్వాన్ని గురించి నిర్బయంగా మాట్లాడిన గొప్ప నాయకుడే కాకుండా తెలుగు మాండలికంలో అనేక యాసలు మాట్లడ గలిగిన గొప్ప వ్యక్తి కోటాశ్రీనివాసరావుగారని ఆయన కీర్తించారు”

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ నాటకరంగం నుంచి ఎదిగి ప్రాణం ఖరీదు సినిమాతో సినిమారంగంలో ప్రవేశించి తెలుగు,తమిళ్ ,కన్నడ తదితర భాషల్లో సుమారు 750 సినిమాలు నటించి 9 నంది అవార్డులు,పద్మ శ్రీ అవార్డు గ్రహీత విలక్షణ నటులు,బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోటా శ్రీనివాసరావు ని,ఆయన MLA గా వున్నప్పుడు గ్రామీణ అభివృధ్ది శాఖ ద్వారా గ్రామాలకు రోడ్లు పేదలకు ఇళ్ళు ఇచ్చేవారిని,మరి పట్టణాలలో వుండే పేద ప్రజలకు కూడా ఇల్లు ఇవ్వాలని ఆయన అప్పట్లో కేంద్ర మంత్రిగా వున్న వెంకయ్యనాయుడి ని అడగటం జరిగిందని,ఆయన కోరిక మేరకు వెంకయ్య నాయుడి మోది తో చర్చించి ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో ఇస్తున్న ప్రధాని ఆవాస యోజన ద్వారా పట్టణ ప్రాంత ప్రజలకు ఇస్తున్న ఇళ్ళని ,కోటాశ్రీనివాసరావుగారి సంకల్పం ద్వారానే ఇప్పుడు 1కొటి 30లక్షల ఇళ్ళు పేద ప్రజలకు మంజూరి అయ్యాయని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో బాబు మోహన్ సుప్రసిద్ధ సినీ నటులు, మాజి మంత్రి వర్యులు ఫోన్ ద్వారా లైవ్ లో మాట్లాడుతూ మా అన్న కోటా శ్రీనివాస రావు సినీ ప్రస్థానం ప్రాణంఖరీదు సినిమా నుండి ప్రారంభమయ్యిందని,బొబ్బిలిరాజా సినిమాలో మాకు పరిచయమయ్యందని,ప్రతిఘటన సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చిందని,మామగారి సినిమా నుండి మా కాంభినేషన్ ప్రారంభ మయ్యందని,మేము జంట పక్షుల్లాగా సినిమాలు చేస్తుా కలిసిమెలసి అన్నదమ్ముల్లా రాత్రిపగలు తేడా లేకుండా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించామని,దేవుడు మాఇద్దరి జీవితాల్లో ఒక విషాధఘటన మిగిల్చాడని మా ఇద్దరి కుమారులు యాక్సడెంట్ లో చనిపోయారని,సినిమాలోనే కాకుండా రాజకీయ నాయకులుగా MLAలుగా అసెంబ్లీలో నవ్వులు పూయించామని,నామాట ఆయన,ఆయన మాట నేను వినే వారమని చనిపోయే ముందు రోజు కూడా నాతో మాట్లాడాడని,ఆయన లేని లోటు అందరికంటే నాకే ఎక్కువని ఆ యన ఈ సందర్బంగా భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్బంగా కైకలూరు మాజీ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల అన్న చందంగా రాజకీయ, సినీరంగంలో కోటా శ్రీనివాసరావుకు ఎవరు సాటిరారని ,అటువంటి విలక్షణ నటున్ని కోల్పోవడం దురదృష్టకరమని,వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాని ఆయన వివరించారు.

ఈ సందర్బంగా NTR జిల్లా జనసేన అధ్యక్షులు ,మాజీ శాసన సభ్యులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ కోటా శ్రీనివాసరావుగారు కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారని,1978 సినీ రంగ ప్రవేశం చేశారని,హరిహర వీరమల్లు ఆయన చివరి సినిమా అని ఆయన నటనలో జీవించేవారని,తండ్రి పాత్ర అయిన,విలన్ పాత్ర అయిన ,హాస్యపాత్ర అయిన ఆయన అలవోకగా నటించేవారని,ఆయన 1999 లో విజయవాడ తూర్పు నియోజకవర్గ MLA గా అనేక అభివృధ్ది కార్యక్రమాలకుశ్రీకారం చుట్టారని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ MLA దారా సాంబయ్య మాట్లాడుతూ జాతస్య మరణం ధృవం పుట్టిన వారు మరణించక తప్పదు మరణించిన వారు పుట్టక తప్పదు అని కృష్ణుడు అర్జునితో భగవధ్గీతలో చెప్పారని,ఇటువంటి గొప్ప నటులకు చావులేదని,కోటా శ్రీనివాసరావుగారు సహజనటులని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేసారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి నూకల మధుకర్ జీ,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు,బిజెపి జాతీయ SC మోర్చా కార్యవర్గ సభ్యురాలు బొడ్డునాగలక్ష్మి,బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజి,NTR జిల్లా BJP ప్రధాన కార్యదర్శులు కొలపల్లి గణేష్,అన్నెపాక ప్రపుల్లా శ్రీకాంత్,పిట్టల గోవిందు,బిజెపి సీనియర్ నాయకులు మువ్వల సుబ్బయ్య,పియూష్ దేశాయ్,నున్న కృష్ణ,పోలే శాంతి,సురేష్,బల్లబ్బాయి,మరియు NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, కీ శే శ్రీ కోట శ్రీనివాసరావు అభిమానులు పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here