
విజయవాడ నగరపాలక సంస్థ
06-11-2025
SRR కళాశాలలో జరిగే మెగా జాబ్ మేళా లో యువత పెద్దయత్తున్న పాల్గొనాలి
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నవంబర్ 7వ తారీఖున SRR& CVR Govt Degree కళాశాలలో ఉదయం 8.30 గం నుండి జరిగే మెగా జాబ్ మేళా లో విజయవాడ నగరం నుండే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొని ఉపాధి పొందాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ యువతకు అండగా నిలబడి, వారికి ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నాలలో భాగంగానే, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) కీలక పాత్ర పోషిస్తు APSSDC రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మల్టీనేషనల్ కంపెనీలు, ఐటీ కంపెనీలను దాదాపు 42 కంపెనీలను ఆహ్వానించి, యువతకు నైపుణ్య శిక్షణను అందిస్తు శిక్షణ ద్వారా యువతకు ఉద్యోగ మార్కెట్లో పోటీ పడే సామర్థ్యం పెంచి కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా, వారికి సులభంగా ఉద్యోగాలు లభించేలా APSSDC కృషి చేస్తోందని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో మరియు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడటంలో కీలకమైనవి, ప్రభుత్వం ఈ సమగ్ర విధానం రాష్ట్ర యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని అన్నారు.
![]()
