P-4 పథకంలో భాగంగా స్వయంగా తన నిధులతో 250 తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బళ్ళు అందజేశాం

Spread the love

14-10-2025

P-4 పథకంలో భాగంగా స్వయంగా తన నిధులతో 250 తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బళ్ళు అందజేశాం

ధి:-14-10-2025 మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు సింగినగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరుపేదలై, బతుకుతెరువు కోసం రోడ్లు పక్కన జీవనం సాగిస్తున్న నిరుపేదల కు P-4 పథకంలో భాగంగా సహాయం అందించబడింది. ఈ పథకం కింద, నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ కు చెందిన 4 కుటుంబాలకు తోపుడు బండ్లను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు స్వయంగా తన చేతుల మీదగా బాధితులకు అందించడం జరిగింది…

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో ఎంతో నిబద్ధతతో పనిచేసిందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా, ఎన్నికల సమయంలో ఇవ్వనటువంటి అనేక హామీలను కూడా అమలు చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని NDA ప్రభుత్వం అని…

ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయదని, కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకువచ్చాయని, ముఖ్యంగా, నిరుపేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని…

ఈ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మరింత మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిరుపేదలను, స్ట్రీట్ వెండర్స్‌ను అందరినీ ఆదుకోవడానికి తాను వ్యక్తిగతంగా కృషి చేస్తున్నానని, స్వయంగా తన నిధులతో తోపుడు బండ్లు,టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బళ్ళు, వినికిడి సమస్య ఉన్నవారికి వినికిడి యంత్రాలు, వంటివి అందిస్తున్నానని.

అంతేకాకుండా, దివ్యాంగులకు ట్రై బ్యాటరీ సైకిల్లు, వినికిడి సమస్య  అవసరమైన వస్తువులను అన్నింటినీ అందిస్తున్నానని, ఈ కార్యక్రమం ద్వారా తన వ్యక్తిగత నిధుల నుండి ఈ సహాయాన్ని అందించడం ద్వారా కేవలం ఒక సహాయం మాత్రమే కాదని, అది వారి ఆత్మగౌరవాన్ని పెంచి, స్వయం ఉపాధిని కల్పించి, వారి జీవితాల్లో కొత్త ఆశలను నింపుతుందని, ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించడానికి అవసరమైన వనరులను అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్,డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, ఇంచార్జ్ మోత్కూరి కాసిం, క్లస్టర్ బత్తుల కొండ, లబ్బ దుర్గ, BDR, పెద్ది శ్రీను, అయ్యప్ప, SK మెహర్, జానీ తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *