HDSS ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద 11వ తేదీన మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

7
0

తేదీ:-10/7/2025
గుత్తి

పెండింగ్ లో ఉన్న 6400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

పేద విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలి

HDSS ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద 11వ తేదీన మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

గుత్తి పట్టణంలో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ హాస్టల్ ఆవణంలో
HDSS, రాష్ట్ర అధ్యక్షుడు, బి. మోహన్ నాయక్ పిలుపు

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, పేద విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని HDSS ఆధ్వర్యంలో 11వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈరోజు HDSS ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా HDSS రాష్ట్ర అధ్యక్షుడు, బి. మోహన్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జూలై 4వ తేదీ నుండి పదవ తేదీ వరకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర సమితి పిలుపుమేరకు కార్యక్రమాలు విజయవంతం చేసుకుని ఈ నెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు, డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసుకున్న వారి సర్టిఫికెట్లు కళాశాల వారు ఇవ్వకుండా మాకు ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడలేదు అవి పడితేనే మీకు సర్టిఫికెట్లు అందజేస్తామని కళాశాల యాజమాన్యులు తెలియజేస్తున్నారు.. కళాశాలల్లో నడుపుకోవాలన్నా కూడా పాఠాలు చెప్పే అధ్యాపకులకు జీతాలు ఇవ్వాలి అలా ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళాశాలకు విద్యార్థులకు రావాల్సిన బకాయిలు 6400 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ జూనియర్ కళాశాల సమయాన్ని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు అన్ని విద్యార్థి సంఘాలుగా మద్దతుగా ఇవ్వాల్సిందిగా HDSS ఈ కార్యక్రమంలో రమేష్ రమణ భాస్కర్ రెడ్డి గోపి మణికంఠ చంటి బాబు గోపినాథ్ పాల్లోన్నారు

హరితదివ్యాంగులసేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు, బి. మోహన్ నాయక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here