APDCCL DE, ADE, AE లతో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర సమావేశం నిర్వహించారు

2
0

29-7-2025

ధి :-29-7-2025 మంగళవారం సాయంత్రం సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు  APDCCL DE, ADE, AE లతో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ స్కీం ద్వారా ప్రభుత్వం సబ్సిడీ సదుపాయం మరియు తక్కువ వడ్డీతో బ్యాంకు నుండి రుణం పొందే అవకాశం కనిపిస్తుందని, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 96వేల ఇల్లు ఉన్నాయని వీరందరికీ కూడా విద్యుత్ శాఖ సిబ్బంది, సోషల్ వర్కర్లు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మరియు స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సభ్యులు సమన్వయం చేసుకొని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు…

సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు సుమారు 3 కిలో వాట్ సోలార్ రూట్ ఆఫ్ ఏర్పాటుకు 2 లక్షల ఇరవై మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని, దీనిలో ప్రభుత్వం 78వేలు సబ్సిడీ కింద భరిస్తుందని ఈ సోలార్ రూట్ ఆఫ్ కు సబ్సిడీ పోను అయ్యే మొత్తాన్ని బ్యాంక్ లోన్ రూపంలో ఇస్తుందని తెలియజేశారు…

సుమారు నెలకు 1300 రూపాయలు EMI ఒకొక్క ఇంటి యజమానికి పడుతుందని ఇది వారి నెలసరి విద్యుత్ బిల్లుతో సమానమని తెలియజేశారు, తద్వారా పథకాలకి అన్ని ప్రభుత్వ పథకాలకు కరెంట్ బిల్లు లేకపోవడం వల్ల అర్హులు అవుతారని తెలియజేసారు…

సుమారు 400 ఒక్కొక సోలార్ రూట్ ఆఫ్ ద్వారా నెలకు 400 యూనిట్ల కరెంటును ఉత్పత్తి చేయగలుగుతామని వేసవికాలంలో తప్ప మిగిలినటువంటి కాలంలో 250 యూనిట్లు సరాసరి విద్యుత్తును వినియోగిస్తారని,200 యూనిట్లు మిగిలినటువంటి యూనిట్లతో 3 నెలలకు ఒకసారి యావరేజ్ యూనిట్ లో లెక్కించి ఆ మొత్తాన్ని గృహ యజమానికి APDCCL చెల్లిస్తుందని తెలియజేశారు…

ఈ పథకాన్ని తాము సెంట్రల్ నియోజకవర్గంలోని 96 లక్షల గృహమూలకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం చేపడతామని త్వరలో త్వరలో స్థానిక రిసోర్స్ పర్సన్ తో వార్డు సచివాలయ సిబ్బందితో, శానిటేషన్ సిబ్బందితో, సమావేశం ఏర్పాటు చేసి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సహకారం తీసుకొని సెంట్రల్ నియోజకవర్గాన్ని దేశంలోనె సూర్యగర్ యోజన కింద  నమోదయ్యే గృహాలలో మొదటి స్థానం లో నిలబెడతామని తెలియజేశారు, సెంట్రల్ నియోజకవర్గంలో ఇండివిడ్యువల్ బిల్డింగ్స్ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం ప్రభుత్వం కట్టినటువంటి కట్టినటువంటి వాంబే కాలనీ, కండ్రిక, న్యూ రాజరాజేశ్వరి పేట, తదితర ప్రాంతాలలో ఈ పథకం పై అవగాహన కల్పించడం ద్వారా  భారీ విద్యుత్ బిల్లుల నుండి కుశ మనం కల్పిస్తామని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ P రవీంద్రబాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ O బసవరాజు, T నాగేశ్వరరావు, CDO జగదీశ్వరి, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, నియోజకవర్గంలోని అందరూ ఏఈ లు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here