డాక్టర్ సమరం “కాంప్రహెన్సివ్ కంపానియన్ టు సెక్సాలజీ” పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
విజయవాడ, బెంజ్ సర్కిల్ లోని ఆథియస్ట్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ డా. సమరం రచించిన 218వ పుస్తకం – “Comprehensive Companion to Sexology – For All Ages & Genders” ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ –
“జీవితంలో చాలామంది 60 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటారు. కానీ డాక్టర్ సమరం మాత్రం 86 ఏళ్ల వయస్సులోనూ విశ్రాంతి తీసుకోలేదు. ఆయన ఉత్సాహం అద్భుతం. వాజ్‌పేయ్ కూడా ఒక సమావేశంలో — ‘నేను అలసిపోలేదు, రిటైర్ కాలేదు’ అని అన్నట్లుగానే, డా. సమరంలో కూడా ఎంతో శక్తివంతంగా, ఉత్సాహం గా కనిపిస్తున్నారు
ఆరోగ్య శాఖ గురించి అంతంతమాత్రంగానే తెలిసిన నాకే – ఇన్ని పుస్తకాలు చదవాలా అనే ఆశ్చర్యం కలిగింది. ఆయన రాసిన 218 పుస్తకాలు విజ్ఞాన ధారలుగా నిలుస్తున్నాయి. ఈ ఆధునిక కాలంలో మాట్లాడటానికి ఇంకా జనం సిగ్గుపడే విషయాలపై డా. సమరం చాలా కాలం క్రితమే శాస్త్రీయంగా మాట్లాడారు. ఇది ఆయన దూరదృష్టికి నిదర్శనం.
సైన్స్ గురించి విస్తృతంగా అవగాహన కలిగిన వ్యక్తి ఆయన. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పుట్టినందునే గోరా ఆయన్ని “సమరం” అని పేరు పెట్టారు. ఈ రోజుల్లో పేర్లు పెట్టేటప్పుడు అర్ధం లేని పేర్లు పెడతారు, కానీ పేరుకి గల ఉద్దేశం ఎంతో ముఖ్యం. డా. సమరం పేరు, ఆయన జీవితం అంతటా ఈ ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ అభివృద్ధి అద్భుతంగా జరిగింది. ఆరోగ్య రంగంలోనే మన దేశంలో ఇప్పటి వరకు 25 యూనికార్న్ కంపెనీలు వచ్చాయి. ఇది దేశ అభివృద్ధికి, ఆరోగ్య రంగానికి ఎంత ప్రాధాన్యతనిస్తామో తెలియజేస్తోంది.” అని మంత్రి అన్నారు