ఎన్టీఆర్ జిల్లా / నందిగామ :
నందిగామ లో విధ్వంసక పాలనకు నిదర్శనం రాజశేఖరరెడ్డి విగ్రహన్ని తొలగగించడం – డా” మొండితోక జగన్మోహనరావు
ప్రజానేత ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని దుర్మార్గంగా,అక్రమంగా అర్ధరాత్రి సమయంలో తొలగించడం ఉన్మాదచర్య – దేవినేని అవినాష్
నందిగామ గాంధీ సెంటర్ లో అర్ధరాత్రి దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించిన మున్సిపల్ అధికారులు..
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ,స్థానిక ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు , తిరువూరు ఇంచార్జ్ స్వామి దాసు ,పునూరు గౌతమ్ రెడ్డి మరియు వేలాది మంది పార్టీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
కక్షపూరీతంగా తొలగించిన వైయస్ ఆర్ విగ్రహం ఉన్న చోటే యధావిధిగా
ఏర్పాటు చేయాలనీ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు..