8-8-2025
నియోజకవర్గ కార్యకర్తలకు, ప్రజలకు అండదండ MLA బొండా ఉమా
ధి:-8-8-2025 శుక్రవారం ఉదయం 9 గంటల నుండి వరుసుగా సింగ్ నగర్ డాబాకోట్లు సెంటర్లోని సంగం డైలీ పార్లర్ను మరియు రోడ్డుమీద జీవనం గడుపుతు వ్యాపారం చేసుకునే వ్యక్తికి అరటిపండ్ల వ్యాపార నిమిత్తం తోపుడు బండిని మరియు పాయకాపురం లోని ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేసుకునేటువంటి బడ్డీ కొట్టుకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తన సొంత నిధులతో ఆర్థిక సహాయం చేసి ఆర్థిక సహాయం చేసి తన చేతుల మీదగానే ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- నియోజకవర్గంలో చిరు వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా చూసేందుకు అర్హులైన వారందరికీ బ్యాంకుల ద్వారా కూడా ఆర్థిక రుణాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వారి జీవన విధానానికి ఆటంకాలు ఏర్పడకుండా, అధికారులతో పోలీసు వారితో అనుమతులు ఇప్పిస్తున్నామని, రాబోయేటువంటి రోజులలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ సీట్ వండర్స్ అందరికీ, హకర్స్ కి, తాను అండగా ఉంటానని తెలిపారు.
గత వైసిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీరిని అలసత్వం చేయడంతో, ఆ ఐదు సంవత్సరాలు ఆర్థికంగా తీవ్ర తిక్కట్లకు గురయ్యారని అనేక పేద వర్గాలు, వడ్డీ వ్యాపారస్తుల చెరలో మగ్గుతూ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులను వివరించడంతోపాటు వారిపై ఆర్థిక నేరాల కేసులు పెట్టిన సంగతి కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలియజేస్తూ, విచారం వ్యక్తం చేసి ఈ NDA ప్రభుత్వం అలాంటి అరాచకాలను అంతం చేసి పేదవర్గాల పక్షాన నిలిచి వారి జీవన విధానానికి బంగారు బాటలు వేసే విధంగా P4 లో కూడా అలాంటి భాగస్వామ్యం చేసి ప్రభుత్వ పథకాలు అన్ని వారికి అందించడమే కాకుండా అభివృద్ధిలో కూడా వారిని భాగస్వామ్యం చేసి ఆ కుటుంబ బాధ్యతను తాను తీసుకొని ఆ కుటుంబానికి పెద్దకొడుకుల ఉంటానని బొండా ఉమా తెలిపారు.
ఈ కార్యక్రమంలో:- టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, డివిజన్ అధ్యక్షులు బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, ఇంచార్జి SK జాన్ వలి,Sk ఫర్వీన్, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, బత్తుల కొండ, SK మెహర్ తదితరులు పాల్గొన్నారు.