04-08-2025
గవర్నర్ అశోక్ గజపతి రాజును సత్కరించిన టిడిపి ఎంపీలు
శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్
ఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో వున్న గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సోమవారం పార్లమెంట్ లోని టిడిపి పార్లమెంటరీ పార్టీ కార్యాలయంకు విచ్చేశారు. ఈసందర్భంగా టిడిపి ఎంపీలు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. గోవా గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన గవర్నర్ అశోక్ గజపతి రాజుకు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విమానాయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఎంపీలు లావు కృష్ణ దేవరాయులు, హరీష్ మాధూర్, ఎం. భరత్, కలిశెట్టి అప్పలనాయుడు, దగ్గుమళ్ల ప్రసాదరావు, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు పాల్గొన్నారు.