దీన్-దయాళ్ అంత్యోదయ జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ పై సమీక్ష

0
0

విజయవాడ నగరపాలక సంస్థ
04-08-2025

దీన్-దయాళ్ అంత్యోదయ జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ పై సమీక్ష

విజయవాడ నగర పలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ లో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించేందుకు దీన్-దయాళ్ అంత్యోదయ జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ (DAY-NULM) డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ యాదవ్, మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్ తేజ్ భరత్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ లో DAY-NULM కార్యక్రమాల ప్రగతిని మెప్మా మిషన్ డైరెక్టర్ . తేజ్ భరత్ ఐఏఎస్ సవివరంగా వివరించారు. దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుంది, ఎన్నో సామాజిక ఆర్ధిక మోడల్ లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెలకొల్పింది, SHG ఉద్యమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దేశానికి మార్గదర్శకత్వం చేస్తుంది. వల్నరబుల్ కమ్యూనిటీ మరియు గిగ్ వర్కర్ లను సంఘాలను ఏర్పాటులో విజయవాడ ముందుందని తెలిపారు.

ఈ సమావేశంలో నేషనల్ అర్బన్ లైవ్ అడ్మిషన్ లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ లో పైలెట్ ప్రాజెక్టు లో నిర్వహించనున్న లేబర్ చౌక్లు, షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్ లెస్, సిటీ లైవ్లీహుడ్ సెంటర్స్, కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్ట్రీట్ వెడ్డింగ్ జోన్, స్ట్రీట్ షెల్టర్, సుయోగ్ సెంటర్ అంశాలపై ప్రాజెక్ట్ ఆఫీసర్ (యుసిడి) పి. వెంకటనారాయణ వివరించారు.

నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ లో భాగంగా 323 కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులను ఏర్పాటు చేశారని, అందులో వేస్ట్ వర్కర్లు, కేర్ వర్కర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, ట్రాన్స్పోర్ట్ వర్కర్లు, డొమెస్టిక్ వర్కర్లు, గిగ్ వర్కర్స్ లతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు.

ఈ సమావేశంలో వీధి వ్యాపారస్తుల కోసం ఏర్పాటు చేయబోయే స్మార్ట్ సిటీ, స్వయం సహాయ బృందాల మహిళల ఆర్థిక పురోగతిని పెంచేందుకు తృప్తి కాంటీన్, రాపిడో వెహికల్, ఏర్పాటు చేశారని అన్నారు.

ఈ సందర్భంగా దీన్-దయాళ్ అంత్యోదయ జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మెప్మాలో డిజిటల్ ఇనిషియేటివ్ లు చాలా బాగున్నాయని, జీవనోపాధి కార్యక్రమాలు తృప్తి కాంటీన్, రాపిడో వెహికల్, స్మార్ట్ స్ట్రీట్, రిటైల్ సెక్టార్ చాలా బలంగా ఉన్నాయని, ఇదే విధంగా కృషిచేసి పట్టణ పేదరిక నిర్మూలనకు కృషిచేయాలని అభిలషించారు. తదుపరి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న మెప్మా కార్యక్రమాలను పరిశీలించారు.

 ఈ సమావేశంలో  స్టేట్ మిషన్ మేనేజర్లు రంగాచార్యులు, NNR శ్రీనివాస్ మరియు ఇతర మెప్మా మరియు VMC యూసీది సీడీఓలు, టెక్నికల్ ఎక్స్పర్ట్లు, సిబ్బంది మరియు సంఘ మహిళలు RPలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here