టిడిపి ట్రేడర్ కమిటీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ధనేకుల వెంకట హరికృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని జన్మదిన వేడుకలు

9
0


పశ్చిమ నియోజకవర్గం టిడిపి ట్రేడర్ కమిటీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ధనేకుల వెంకట హరికృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని జన్మదిన వేడుకలు కంసాలిపేట వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది.

  ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం  TDP ట్రేడర్ కమిటీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్  ధనేకుల వెంకట హరికృష్ణ (నాని )మాట్లాడుతూ కేశినేని శివనాథ్ చిన్ని  జన్మదినం సందర్భంగా కంసాలిపేటలో శ్రీ శ్రీ శ్రీవిజయ దుర్గ ఆలయంలో  పూజా కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పుస్తకాలు  పెన్నులు  కార్యక్రమం  చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమంలో చేస్తూ మొబైల్ అన్న క్యాంటీన్లు ద్వారా పేద ప్రజలకు ఆకలి తీర్చే వ్యక్తి చిన్ని ని  మరియు పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నీ నిర్వహించి మొన్న జరిగిన కూటమి  ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలిచిన చిన్ని  ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటున్నారని కేంద్రం నుండి రావాల్సిన నిధులకు తను ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు  అదేవిధంగా నవ్యాంధ్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు  ఆశయ సాధనకి  యువత భవిష్యత్తుకు ఎన్నో కంపెనీలతో మాట్లాడి  జాబ్ మేళా  కార్యక్రమాలు  నిర్వహిస్తూ యువతకి భవిష్యత్తు ఇవ్వడానికి కృషి చేస్తున్నారని అదేవిధంగా ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు అని అన్నారు.

 ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బి. తిలక్ రామ్ సింగ్ దుర్గారావు  ఫిరోజ్ పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here