03-08-2025
ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని దర్శించుకున్న ఎం.పి కేశినేని శివనాథ్ (చిన్ని)
జన్మదినం సందర్బంగా దేవాలయాల సందర్శన
కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు
విజయవాడ : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తన జన్మదినం సందర్భంగా ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గ అమ్మవారిని, శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం లో వినాయక స్వామిని ఆయన సతీమణి జానకి లక్ష్మీ, కుమారుడు వెంకట్, కుమార్తె స్నిగ్ధలతో ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు.
ఎంపి కేశినేని శివనాథ్ కు కనకదుర్గమ్మ ఆలయ ఈ.వో వి.కె శీనా నాయక్ స్వాగతం చెప్పగా, మంగళ వాయిధ్యాల తో ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్చారణ తో ఆహ్వానం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఎంపి కేశినేని శివనాథ్ ను ఆయన సతీమణి జానకీ లక్ష్మీని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేయగా, ఆలయ ఈ.వో వి.కె శీనా నాయక్ అమ్మవారి చిత్రపటాన్ని కేశినేని శివనాథ్ దంపతులకు అందజేశారు.
ఆ తర్వాత కెనాల్ రోడ్ లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలోని వినాయకుడిని ఎంపీ కేశినేని శివనాథ్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించటం జరిగింది. ఆ భగవంతుడి దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ అభివృద్ధి పథంలో పయనించే విధంగా ఆశీర్వదించాలని ప్రార్ధించినట్లు ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు.