03-08-2024
ఎంపి కేశినేని శివనాథ్ బర్త్ డే సందర్భంగా నిర్మల హృదయలో బ్రేడ్, పండ్లు పంపిణీ
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్
విజయవాడ : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుట్టిన రోజు వేడుకలు 23వ డివిజన్ కార్పొరేటర్ టిడిపి ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో గవర్నర్ పేట బందర్ రోడ్డు నందుగల నిర్మల హృదయ భవనం లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ కుమారుడు కేశినేని వెంకట్ కేక్ కట్ చేశారు.. అనంతరం అనాథలకు , వృద్ధులకు ఫ్రూట్స్, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు, టిడిపి నాయకులు వసంతరావు, రవి, సూర్య, రత్నలతో పాటు తదితరులు పాల్గొన్నారు.