పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్.
నియోజకవర్గంలో ఇప్పటికి రూ.6.5 కోట్లు మంజూరు.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 02/08/2025.
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
ఇప్పటివరకు మైలవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ హయాంలో సుమారు రూ.6.5 కోట్ల వరకు సీఎం సహాయ నిధి మంజూరు చేసినట్లు వెల్లడించారు.
జి.కొండూరు మండలం కవులూరు గ్రామంలో పలువురు లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్ఓసిని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ ఇంకా మిగిలి ఉన్న సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులకు త్వరలోనే ఆర్థిక సాయం మంజూరు అవుతుందన్నారు.
మైలవరం నియోజవర్గానికి రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందినట్లు వెల్లడించారు.
దీనిద్వారా సాయం పొందుతున్న లబ్ధిదారులు, ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారు ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.