అన్నదాత సుఖీభవ – పి.యం. కిసాన్‌ పథకంతో రైతులకు ఆర్థిక భద్రత

1
0

ఎన్‌టిఆర్‌ జిల్లా తేది:02.08.2025

        అన్నదాత సుఖీభవ - పి.యం. కిసాన్‌ పథకంతో  రైతులకు ఆర్థిక భద్రత
        జిల్లాలో 1,18,629 మంది రైతులకు  రూ. 80 కోట్ల 77లక్షల లబ్ది జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ

రైతుల ఆర్థిక స్థిరత్వానికి వ్యవసాయరంగ బలోపేతం చేయడానికి అన్నదాత సుఖీభవ - పి.యం. కిసాన్‌ పథకం  ద్వారా అందించే ఆర్థిక సాయం ఎంతగానో దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్‌ డా. జి లక్ష్మీశ అన్నారు. 

జి. కొండూరు మండలం కవులూరు గ్రామంలో శనివారం జరిగిన  అన్నదాత సుఖీభవ - పి.ఎం కిసాన్‌ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ పాల్గొని లబ్దిదారులైన  రైతులకు ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సమాజంలో రైతు పాత్ర కీలకమని, రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా  సబ్బిడీ పై విత్తనాలు ఎరువులు పంపిణీ, పంట వేసేనాటికి అవసరమైన పెట్టుబడి సాయం, పండిరచిన ఉత్పత్తులకు  కనీస మద్దతుధర కల్పించడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. పీఎం కిసాన్‌ పథకం కింద మూడు విడతలగా 6000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం  అన్నదాత సుఖీభవ పథకం కింద  ప్రతి రైతు కుటుంబానికి 14 వేల రూపాయలు  కలిపి మొత్తంగా 20వేల రూపాయలను అందించడం జరుగుతుందన్నారు.  మొదటి విడతగా  జిల్లాలో 1,18,629 మంది రైతు కుటుంబాలకు  రూ. 80 కోట్ల 77లక్షల లబ్ది చేకూర్చామన్నారు. రైతులకు ఆధునిక పరికరాలను,  సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే కాకుండా డ్రోన్ల ద్వారా సాగుకు సహకారం అందిస్తున్నామన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపాలన్నారు. అర్హత

ఉన్న పతి రైతుకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని, సాంకేతిక కారణాలతో ఎవరికైన అందకపోతే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు.

కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ లబ్దిదారులైన  రైతులకు 20 కోట్ల 19 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here