తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., ప్రెస్ స్టిక్కర్లు

0
0

తిరుపతి జిల్లా…

జిల్లా వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., ప్రెస్ స్టిక్కర్లు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఇవ్వడం జరిగినది.

ప్రింటింగ్ ప్రెస్ వాళ్లు మీడియా ప్రతినిధులకు కాని వాళ్ళు అనేకమంది మీడియాలో పనిచేస్తున్నమంటూ చలమణి అవుతున్నారు.

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వాళ్లు ఇబ్బందికరంగా ఉంటుందని మీడియా ప్రతినిధులు చెప్పడం జరిగిందన్నారు.

వారి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని పది రోజులపాటు మా సిబ్బంది శ్రమించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు తయారు చేశారన్నారు.

ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కు క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లను ఏర్పాటు చేశామన్నారు.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ పేరు, మీరు పని చేస్తున్నా సంస్థ పేరు, మీ డెసిగ్నేషన్, ప్రభుత్వ గుర్తింపుతో కలెక్టర్ ఇచ్చిన అక్రిడేషన్ నెంబర్ వస్తుందన్నారు.

ఈ స్టిక్కర్లు ఇవ్వడం వలన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మంటూ చెప్పుకుని తిరుగుతున్న నకిలీ విలేఖరులు బయటపడతారన్నారు.

మా పోలీస్ సిబ్బంది కూడా క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు చూసిన వెంటనే మిమ్మల్ని ఎవరూ అపరన్నారు.

పోలీసు వారికి అనుమానం వస్తే మీ వాహనం మీద ఉన్న క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు స్కాన్ చేస్తారన్నారు.

నకిలీ క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు అని తెలిస్తే… చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

ఈ క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు పోలీసు వారి అనుమతి లేకుండా ఎవరన్నా తయారుచేసిన అలాంటి వారి పైన చర్యలు తీసుకుంటామన్నారు

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ…

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. మీడియా ప్రతినిధుల అభ్యర్థనను మన్నించి క్యూఆర్ కోడ్ తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు తిరుపతి లో ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు.

దీనివలన నకిలీ ప్రెస్ వాళ్కు పని చేసే ప్రెస్ వాళ్లకు మధ్య తేడా తెలుస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here