బాడిత వాసు దేవరావు
దశదినకర్మలో పాల్గొన్న
ఎమ్మెల్యే కార్యాలయ
కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ,
జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, సోదరుడు బాడిత వాసు దేవరావు దశ దిన కర్మ భవాని పురం,పున్నమి ఘాట్ లోని ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించారు.
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ
కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ బాడిత వాసుదేవరావు
దశదినకర్మ లో పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
బాడిత వాసుదేవరావు వన్ టౌన్ లోని పాత శివాలయం ఆలయ చైర్మన్ గా గతంలో సేవలందించారు.
బీజేపీ, జనసేన,
టీడీపీ శ్రేణులు , పలువురు ప్రముఖులు , శ్రేయోభిలాషులు పాల్గొని ఆయన చేసిన సేవలను కొనియాడారు..