అభివృద్ధి సంక్షేమానికి చిరునామా టిడిపి : యార్లగడ్డ

1
0

అభివృద్ధి సంక్షేమానికి చిరునామా టిడిపి : యార్లగడ్డ

ఉంగుటూరు :
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కు టిడిపి చిరునామాగా మారిందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం నాగవరప్పాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ గత 14 నెలలుగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటంతో పాటు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేసిన సంగతి గుర్తు చేశారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. కులమత రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో సాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే పంట కాలువల మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. పది రోజుల క్రితం గన్నవరం నియోజకవర్గంలోని కాలువ కింద గ్రామాల్లో సాగునీటి ఎద్దడి తలెత్తగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఏలూరు కాల్వకు గరిష్ట పరిమాణంలో నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సీజన్లో రైతులకు ఎరువుల కొరత నివారించేందుకు ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేసిన సంగతి గుర్తు చేశారు. ఎక్కడైనా ఎరువుల కొరత ఉంటే తనకు తెలియచేయాలనీ, సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. గన్నవరం, బాపులపాడు మండలాల్లో పారిశ్రామికవాడలు ఏర్పాటు కాగా విజయవాడ రూరల్, ఉంగుటూరు మండలాల్లోనూ అనువైన ప్రాంతాలను గుర్తించి మినీ పారిశ్రామికవాడలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చని యార్లగడ్డ అభిప్రాయపడ్డారు. గన్నవరం నియోజకవర్గంలో 15 వేల మంది ఉద్యోగాలు కల్పిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకుంటానని, ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు తెలుసుకున్న యార్లగడ్డ వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామానికి వచ్చిన యార్లగడ్డకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కొలుసు రవీంద్ర, సెక్రటరీ కుందేటి చందు, గ్రామ అధ్యక్షులు సాల్మాన్, క్లాస్టర్ ఇన్ ఛార్జ్ అరికట్ల రవి కుమార్, ఆళ్ల హనూక్, కాటూరి వరప్రసాద్, అమర్తల సోమేశ్వరావు, మరద పాపారావు, ఈలప్రోలు శ్రీనివాస రావు, పొట్లూరి రాంకుమార్, ఆడుసుమిల్లి రాధాకృష్ణ, సూరపనేని కృష్ణబాబు, వీరపనేని ప్రసాద్, ఈడుపుగంటి కృష్ణ మూర్తి, రెడ్డి భాస్కర్, నాగబాబు, నక్క వెంకటేశ్వరావు, ఆరుమాళ్ళ కృష్ణ రెడ్డి, గొట్టుముక్కల కిట్టయ్య, యార్లగడ్డ విజయ్ బాబు, వెల్దిపాడు PACS అధ్యక్షులు రాజమన్నారు, తెలుగు యూవత అధ్యక్షులు పరుచూరి నరేష్, అయ్యప్ప రెడ్డి, మాగంటి రంగారావు, తదితరులు పాల్గొన్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here