మెరుగైన వైద్యం కోసం
ఎల్ ఓ సీ అందజేత
ఎన్డీఏ కార్యాలయంలో
ఎల్.ఓ.సీ లను అందజేసిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్,కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
(లెటర్ ఆఫ్ క్రెడిట్)
ఎల్.ఓ.సి లను
బుధవారం భవానిపురం
ఎన్డీఏ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్ , జనసేన నేతలు తిరుపతి అనూష, పోలిశెట్టి శివ కూటమి నేతలతో కలిసి
అందజేశారు.
42వ డివిజన్ భవానిపురం కు చెందిన భక్తుల రాము (37) వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతూ గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేశారు.
మంజూరైన రూ 1 లక్ష 60 వేల
ఎల్. ఓ.సీ పత్రాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు
అదేవిధంగా 37వ డివిజన్ సామరంగంచౌక్ కు చెందిన సామా బాలాజీ క్యాన్సర్ తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసర వైద్యం కీమో థెరపీ కోసం ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా రూ 6 లక్షల ఎల్. ఓ.సీ ను అందజేశారు ..
త్వరితగతిన ఎల్.ఓ.సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుల కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి నేతలు తిరుపతి అనూష, పోలిశెట్టి శివ,మంగళపురి మహేష్ , సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పుప్పాల భవాని, హైమావతి తదితరులు పాల్గొన్నారు.