హృద్రోగం తో బాధపడుతున్న బాలుడికి రూ 8 లక్షల
ఎల్. ఓ. సీ అందజేత
కూటమి నేతలతో కలిసి అందించిన ఎమ్మెల్యే కార్యాలయ
కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
50 వ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన బాలుడు గొల్తి హేమ సాయి (13 ) కు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ,కూటమి నేతలతో కలిసి ఎల్ .ఓ. సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)
ను అందజేశారు..
చిన్నారి హేమ సాయి
పుట్టుకతో హృద్రోగం తో బాధపడుతున్నాడు.
తనకి గుండె వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలని వైద్యులు తెలపడంతో బీజేపీ నాయకులు అవ్వారు బుల్లబ్బాయి
ఎల్. ఓ .సీ కొరకు ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తుచేశారు..
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
రూ 8 లక్షల 2 వేల ఎల్. ఓ. సీ ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు..
త్వరితగతిన ఎల్. ఓ. సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా కు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు కొప్పుల గంగాధర్, మైలవరపు కృష్ణ, అవ్వారు బుల్లబ్బాయి, భాను, గణేష్ ,సుజనా మిత్రా కోఆర్డినేటర్లు కొల్లి దుర్గారావు, లక్ష్మి ప్రసన్న, సుహాసిని తదితరులు పాల్గొన్నారు..