ప్ర‌జలంద‌రూ ఆరోగ్యంగా వుంటేనే స‌మాజాభివృద్ది సాధ్యం : టిడిపి యువ నాయ‌కుడు కేశినేని వెంక‌ట్

0
0

27-07-2025

ప్ర‌జలంద‌రూ ఆరోగ్యంగా వుంటేనే స‌మాజాభివృద్ది సాధ్యం : టిడిపి యువ నాయ‌కుడు కేశినేని వెంక‌ట్

కేశినేని ఫౌండేష‌న్, ఫినిక్స్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

ఫ్రీ మెగా ఐ మెడిక‌ల్ క్యాంప్ ను ప్రారంభించిన కేశినేని వెంక‌ట్

సోమ‌వారం శంక‌ర్ కంటి ఆసుప‌త్రిలో 30 మందికి కంటి ఆప‌రేష‌న్లు

*కంటి ప‌రీక్ష‌లు చేయించుకున్న 250 మంది

విజ‌య‌వాడ : ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా వున్నారు. ప్ర‌జ‌లు చాలామంది కంటి స‌మ‌స్య‌ల ప‌ట్ల‌ నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. అంద‌రికీ క‌ళ్లు ప్ర‌ధానం…వాటిని చాలా జాగ్ర‌త్త ప‌రిర‌క్షించుకోవాలి. ప్ర‌జ‌లందరూ ఆరోగ్యంగా వుంటేనే స‌మాజాభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) త‌న‌యుడు టిడిపి యువ నాయ‌కుడు కేశినేని వెంక‌ట్ అన్నారు.

ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గంలోని గ‌ణ‌ప‌తిరావురోడ్ గ‌ల ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్యాంప్ కార్యాల‌యంలో ఆదివారం కేశినేని ఫౌండేష‌న్, ఫినిక్స్ ఫౌండేష‌న్ సంయుక్తంగా శంక‌ర్ కంటి ఆసుప‌త్రి సౌజ‌న్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభోత్స‌వానికి టిడిపి యువ నాయ‌కుడు కేశినేని వెంక‌ట్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ ప్రారంభోత్స‌వానికి విచ్చేసిన కేశినేని వెంక‌ట్ కు స్థానిక నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

కేశినేని వెంక‌ట్ ను మైనార్టీ సెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫతావుల్లా ముస్లిం సంప్ర‌దాయ ప‌ద్ద‌తిలో స‌త్క‌రించారు. ముందుగా కేశినేని వెంక‌ట్ నాయ‌కుల‌తో క‌లిసి టిడిపి వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి, నంద‌మూరి తార‌క‌రామారావు విగ్ర‌హానికి పూల‌మాల‌వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నాయ‌కుల‌తో క‌లిసి ప్రారంభించారు.

అలాగే ఈ శిబిరానికి హాజ‌రైన ప్ర‌జ‌ల‌తో కేశినేని వెంక‌ట్ మాట్లాడి వారు ఇబ్బంది ప‌డుతున్న‌ కంటి స‌మ‌స్య‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. అంద‌రితో పాటు కేశినేని వెంక‌ట్ కూడా ఈ శిబిరంలో కంటి వైద్య‌ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ సంద‌ర్భంగా కేశినేని వెంక‌ట్ మాట్లాడుతూ ఫీనిక్స్ ఫౌండేషన్, కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైపు శిబిరం ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు.

ఫినిక్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ చుక్క‌ప‌ల్లి రాకేష్ మాట్లాడుతూ ఈ ఐ క్యాంప్ లో 250 మందికి పైగా ప్ర‌జ‌లు ప‌రీక్ష‌లు చేయించుకోగా, వీరిలో 30 మందికి కంటి ఆప‌రేష‌న్లు చేయాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు. ఆ 30 మందికి కేశినేని ఫౌండేష‌న్, ఫినిక్స్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం పెద‌కాకాని లోని శంక‌ర్ కంటి ఆసుపత్రిలో కంటి ఆప‌రేషన్లు చేయించ‌టం జ‌రుగుతుందని తెలిపారు. ఈ ఫ్రీ ఐ క్యాంప్ లో కంటి పరీక్ష‌లు చేయించుకున్న వారిలో అవ‌స‌ర‌మైన వారికి ఉచితంగా ముందులు అందించ‌టం జ‌రిగింద‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ,టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌కుమార్, నియోజ‌క‌ర్గ ప‌రిశీల‌కులు చిట్టాబ‌త్తుని శ్రీనివాస‌రావు (చిట్టిబాబు), ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ చైర్మ‌న్ డూండీ రాకేష్‌, రాష్ట్ర తెలుగు మ‌హిళా ఉపాధ్య‌క్షురాలు షేక్ ఆషా, నియోజ‌క‌వ‌ర్గ తెలుగు మ‌హిళా అధ్య‌క్షురాలు సుఖాసి స‌రిత‌, నియోజ‌క‌వ‌ర్గ తెలుగు యువ‌త అధ్య‌క్షుడు ఆర్.మాధ‌వ‌, కార్పొరేట‌ర్ ఉమ్మ‌డి చంటి, డివిజ‌న్ అధ్య‌క్షులు మ‌ధు, జాహీద్, హ‌జీజ్, దుర్గారావు, గంగాధ‌ర రెడ్డి, ఈగ‌ల సాంబ‌, జోగేష్, అమ‌ర‌ముర‌ళీ, క్ల‌స్టర్ ఇన్ చార్జులు డి ప్ర‌భుదాసు, వివికె న‌ర‌సింహారావు, సుభాని, ధ‌నేకుల సుబ్బారావు, టిడిపి నాయ‌కులు మైల‌వ‌ర‌పు కృష్ణ‌, మైల‌వ‌ర‌పు దుర్గా రావు, తమీమ్ అన్సార్, గోలి శ్రీనివాస్, ఐటిడిపి స్ర‌వంతి, చైత‌న్య‌, దాడి ముర‌ళీ, విజ‌య‌లక్ష్మీ, రామ‌ల‌క్ష్మీ, శాంతి, వ‌ర‌ల‌క్ష్మీ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here