ముందుతరాలకు వ్యవసాయంలో మెరుగైన సారవంతమైన భూములను

2
0

వ్యవసాయ శాఖ

ముందుతరాలకు వ్యవసాయంలో మెరుగైన సారవంతమైన భూములను అందించటానికి నానో ఎరువుల వినియోగం అత్యంత అవసరం :::
డిల్లీ రావు ఐఏఎస్

  • నానో ఎరువుల వినియోగం తప్పనిసరి అవసరం
  • మన దేశ ఆహార భద్రత ,పోషక భద్రత సాధించే దిశగా పంటల దిగుబడులు పెంచడంలో దీటైన ప్రత్యామ్నాయ పద్ధతి – నానో ఎరువుల వినియోగము .
  • నానో వల్ల పోషక వినియోగ సామర్థ్యం ఎక్కువ
  • రసాయనిక ఎరువుల మాదిరిగా నీటిలో కరిగిపోయి నేలలో ఇంకటం ,పక్క చేలకు కొట్టుకు పోవడం జరగదు
  • నానో ఎరువులలోని ఉప పదార్థాలు నేలలకు , పంటలకు మేలు చేసేలా దోహదపడతాయి .
  • పర్యావరణాన్ని కాపాడేందుకు నానో ఎరువుల వినియోగం అత్యంత అవసరం .
  • మన రాష్ట్రములో గత సంవత్సరం ఎరువులపై చెల్లించిన సబ్సిడీ రూ.12500/- కోట్ల రూపాయలు

  • ఈరోజు విజయవాడ లో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యములో వ్యవసాయ వనరుల రంగములో నూతనముగా ఎదుగుతున్న నానో సాంకేతిక పరిజ్ఞానం అనే అంశంపై రాష్ట్రములోని జిల్లా వ్యవసాయ అధికారులకు జరిగిన కార్యశాలలో ముఖ్య అతిథి గా రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ పాల్గొన్నారు . ఆచార్య యన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ శారద జయలక్ష్మి దేవి ,పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ అతిథులుగా పాల్గొన్నారు .
    డిల్లీ రావు మాట్లాడుతూ దేశ వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువుల తయారీకి అవసరమైన భాస్వరం ,పొటాష్ ,గంధకం తదితర ముడిసరకుల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తున్నదని ,పాశ్చాత్య దేశాల్లో తరచుగా యుద్ధ వాతావరణం ఏర్పడుతుండటం ,తద్వారా డాలర్ విలువ పెరిగి మన దేశానికి విదేశీ మారక ద్రవ్య వ్యయం ఎక్కువగా పెరగటం జరుగుతున్నాయని తెలిపారు .గత నాలుగేళ్లలో కరోనా తర్వాత ఎరువులకు సబ్సిడీ రూపములో 95000/- కోట్ల రూపాయల నుండి ప్రస్తుతం 1,70,000/- కోట్ల రూపాయల వరకు వ్యయం పెరిగిందని చెప్పారు .అంతేకాకుండా మన దేశం ఎరువుల ముడిసరుకు కోసం విదేశాలపై తప్పనిసరిగా ఆధారపడాల్సి వస్తున్నదని తెలిపారు .
    నేలలను జీవమున్న పదార్థంగా బావించి ,నేలలు బలోపేతం అవ్వటానికి తగినంత సేంద్రీయ పదార్థాలను అందించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు . నేలలలో తగినంత సేంద్రీయ పదార్థం లేకపోవడం ,పంట దిగుబడుల కోసం రైతులు మితిమీరి రసాయనిక ఎరువులను వాడటం వల్ల నేల భూ భౌతిక పరిస్థితి దెబ్బతింటున్నదని ,కాబట్టి రైతులు ఇప్పటినుండే రసాయనిక ఎరువుల వినియోగం లో కొంతమేర పాక్షికంగా తగ్గించి వాటి స్థానములో నానో ఎరువులను వాడటం వల్ల నేల ఆరోగ్యం బాగా అభివృద్ధి చెంది ముందుతరాలకు సారవంతమైన భూముల అందించిన వారం అవు తామని తెలిపారు .
    రాష్ట్రములో ఎరువులకు పెడుతున్న సబ్సిడీ 12500 కోట్ల రూపాయలగా ఉన్నదని ,క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులందరూ రైతులకు నానో సాంకేతిక పరిజ్ఞానం పై పూర్తి అవగాహన కల్పించాలని,వారిలో నానో ఎరువుల వినియోగంపై చైతన్యం తీసుకురావాలి అన్నారు .గత సంవత్సరం 3.5 లక్షల నానో యూనిట్లు ను వ్యవసాయంలో వినియోగించారని ,ఈ సంవత్సరం 21 లక్షల నానో బాటిల్ యూనిట్లు ను లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు .ఎరువుల కొరత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో నానో ఎరువుల వినియోగం అత్యంత అవసరమని రైతులు గుర్తించాలని కోరారు .
    వైస్ ఛాన్సలర్ శ్రీమతి డాక్టర్ శారద జయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న నానో సాంకేతిక పరిజ్ఞానంను మరింత ప్రచారం చేసి రైతులు వినియోగించేవిధముగా పరిశ్రమలు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. రైతులలో మరింత అవగాహన పెంచేలా నానో పై దీర్ఘకాల ప్రయోగాలు జరపాలన్నారు .నానో అవశేష ప్రభావం నేలలపై,పర్యావరణంపై ఏ మేర ఉన్నాయో అన్న సమాచారం పై కూడా పరిశోధనలు జరగాలన్నారు .
    పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ నూతన సాంకేతికను యూనివర్సిటీ మరింత ప్రచారం చేయటానికి ,గత 3 సంవత్సరాల పరిశోధన ఫలితాలను ,క్షేత్ర ప్రదర్శన లను ,వివిధ ప్రాంతాల్లో ప్రయోగాల డేటాను అందుబాటులో ఉంచాలని కోరారు .పరిశ్రమలు సహకరిస్తే ప్రయోగాలకు రంగా విశ్వవిద్యాలయం సిద్ధముగా ఉన్నదని తెలియచేశారు .
    నానో అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సుబ్రమణ్యం ,డాక్టర్ రోషన్ మమ్మెన్ , జీవి సుబ్బారెడ్డి లు కంపెనీ తరుపున సమాధానాలు తెలిపారు .
    ఈ కార్యక్రమంలో అదనపు వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వి వి విజయలక్ష్మి, జేడీ ఎరువుల విభాగం కృపదాస్ ,డిడి జీ వేంకటేశ్వర రావు,ఇతర అధికారులు పాల్గొన్నారు.
    అనుమతితో జారీ చేయబడినది
    మీడియా సెక్షన్
    వ్యవసాయ శాఖ.
    ఫోటోలు జత
    చేయబడ్డాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here