64వ డివిజన్ కండ్రిక 106 వ బూత్ బివి సుబ్బారెడ్డి స్కూల్ వద్దకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చం నాయుడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా

3
0

25-7-2025

ధి:-25-7-2025 శుక్రవారం ఈరోజు సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా  సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక 106 వ బూత్ బివి సుబ్బారెడ్డి స్కూల్ వద్దకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చం నాయుడు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  బొండా ఉమామహేశ్వరరావు విచ్చేసి ప్రజల సమస్య అడిగి తెలుసుకోవడం జరిగింది

ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న అచ్చం నాయుడు బొండా ఉమా మాట్లాడుతూ:-తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తయ్యాయి
ఈ 42 ఏళ్లలో అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ ఉన్నాం
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే పని చేశాం, గత ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసింది..

ఐదేళ్ల పాలనను రాష్ట్ర ప్రజలంతా చూశారు, ఎంత ఇబ్బందులు పెట్టినా, టీడీపీ కార్యకర్తలు చెక్కు చెదరలేదు,ప్రజలు 161 సీట్లతో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు,వ్యవస్థలన్నీ నాశనం చేశారు. 10 లక్షల కోట్ల అప్పు చేశారు, అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు అధికారం చేపట్టి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు

కేంద్రంతోనూ సమన్వయం తో ఉండి సహకారం పొందుతున్నాము,రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్న పేషెంట్‌ లా ఉంది, చంద్రబాబు అనుభవంతో రాష్ట్ర పరిస్థితి మెరుగవుతోంది, ఇచ్చిన హామీలు నెరవేర్చగలమా అనే భయం మాలో ఉండేది, కానీ ప్రతి హామీని నెరవేర్చుతున్నాం.

అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తున్నాం, పింఛన్లను పెంచాం. ఒక్క పింఛన్‌పై రూ.64,360 కోట్లు ఖర్చు చేశాం, అన్న క్యాంటీన్లను తిరిగి తీసుకొచ్చాం. తొలగించవద్దని అప్పటి సీఎంకు అసెంబ్లీలో చేతులు జోడించి చెప్పినా పట్టించుకోలేదు, తల్లికి వందనం పేరుతో ఒక్కరోజే రూ.8,700 కోట్లు జమ చేశాం, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది.

వారికి ఉచిత ప్రయాణం ఇస్తే మా పరిస్తితి ఏంటి అని ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వారి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. వారికి ఆర్ధిక సాయం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు, వైసీపీ వైఫల్యంతో బుడమేరు వరదలు వచ్చాయి, విపత్తు సమయంలో చంద్రబాబు 10 రోజులపాటు అక్కడే ఉండి పరిశీలించారు, బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాం, టిడ్కో ఇళ్లు 80 శాతం పూర్తయ్యాక, టీడీపీకి క్రెడిట్ పోతుందనే భయంతో వైసీపీ వాటిని ఇవ్వలేదు, సంక్రాంతి నాటికి అన్ని టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందిస్తాం, సుపరిపాలనలో తొలి 10 స్థానాల్లో సెంట్రల్ నియోజకవర్గం ఉండడం గర్వకారణం, 12 మాసాలలో 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి, 6 లక్షల కోట్ల పెట్టుబడిదారులకు ఇప్పటికే భూమి ఇచ్చాం, ప్రజల వైకుంఠ పాలి ఆట మాట మానుకోవాలి ఒక్క అవకాశం అని అడిగిన జగన్ కి ఓటు వేసి రాష్ట్రాన్ని మనమే నాశనం చేసుకున్నాం, చంద్రబాబు లాంటి వ్యక్తి లేకపోతే మన లాంటి వాళ్ళకే నష్టం, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి.

కష్టపడి పనిచేసే కార్యకర్తలతో ఉన్న నియోజకవర్గం సెంట్రల్, 2014లో ప్రారంభమైన అభివృద్ధితో కండ్రిక అభివృద్ధి సాధ్యమైంది, 2014కి ముందు ఈ ప్రాంతం వెనుకబడి ఉండేది, వర్షం వస్తే నీరు నిలిచిపోయేది డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాం, బుడమేరు వరదలు అనూహ్యంగా వచ్చాయి, అయినా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అని

ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు అండగా నిలిచారు, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకోసమే పనిచేస్తున్నాం, 12 నెలల్లో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపాం, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాం.

అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ రూ.4000గా పెంచాం, వికలాంగులకు రూ.6000, మంచానికే పరిమితమైన వారికి రూ.10,000 ఇచ్చాం, మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు అందజేశాం, ఓట్ల కోసం కాదు అర్హులందరికీ ఇవ్వడం మా లక్ష్యం, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం, త్వరలోనే స్త్రీ నిధి, నిరుద్యోగ భృతి కూడా అందించనున్నాం, ప్రతి డివిజన్‌లో సమస్యలు నాకు తెలుసు అన్నింటికీ పరిష్కారం ఇస్తాం, ఏడాది కాలంలో రూ.240 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తున్నాం అని, ప్రతి ఇంటికి తిరుగుతూ నియోజకవర్గంలోనే 100% పూర్తి చేసిన డివిజన్ నాయకులను అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, సెంట్రల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, డైరెక్టర్లు, వందలాదిమంది ప్రజలు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here