స్వచ్ఛ సర్వేక్షణ్ మంగళగిరికి 11వ ర్యాంకు
స్వచ్చ భారత్ అమలులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్(2024-25)కు మంగళగిరి తాడే పల్లి నగరపాలక సంస్థ.. దేశంలో 386, రాష్ట్ర స్థాయిలో 11వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు కమిషనర్ అలీంబాషా బుధవారం తెలిపారు. పారిశుద్ధ్య విభాగంలో సర్వే, టెస్ట్ ప్రాక్టీస్, సిటి జన్ ఫీడ్బ్యాక్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. స్వచ్ఛ భారత్ మిషన్ రూపొందించిన సర్వీసు లెవెల్ ప్రోగ్రస్, సర్టిఫికేషన్, సిటిజన్ వాయిసు సంబంధించి మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ 7354 మార్కులు సాధించింది. విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ సూచన మేరకు క్షేత్ర స్థాయిలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేసిన కృషికి ఈ ర్యాంకు సాధించామని కమిషనర్ తెలిపారు. భవిష్య త్తులో మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు.
తాడేపల్లికి 44వ స్థానం.. తాడేపల్లికి దేశంలో 634వ
ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 44వ ర్యాంకు లభించింది. తాడేపల్లికి 5389 మార్కులు లభించాయని కమిషనర్ అలీంబాషా తెలిపారు.