ఇంద్రకీలాద్రి, 22 జూలై 2025
మహిమాన్విత ఇంద్రకీలాద్రి మరియు చుట్టు ప్రక్కల శుభ్రం చేస్తూ భక్తుల సేవలో తరించే దేవస్థానం పారిశుధ్య సిబ్బంది భక్తి శ్రద్దలతో అమ్మ వారికి ఆషాఢ సారె సమర్పించడం చూస్తే భక్తి కి చిన్నా పెద్దా తేడా లేదని వీరు నిరూపించారని దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్ అన్నారు.
ఈరోజు ఉదయం దేవస్థానం పారిశుధ్య విభాగం సిబ్బంది ఘనంగా ఆషాడ సారె సమర్పించారు.
జమ్మిదొడ్డి లో ఆలయ కార్యనిర్వాహణాధికారి వి కే శీనా నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు బి వెంకటరెడ్డి, పి.చంద్ర శేఖర్, ఎన్.రమేష్ బాబు, డాక్టర్ కె. గంగాధర్,శ్రీనివాస్,పారిశుధ్య విభాగం సిబ్బంది చందు శ్రీనివాస్, జయ ప్రకాష్,రజిని ప్రియ తదితర దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
సిబ్బంది ఊరేగింపుగా దేవస్థానం చేరుకొని శ్రీ అమ్మవారికి సారే, చీర సమర్పించారు.